ఒకప్పుడు బాషాభేదం లేకుండా వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత కనపడకుండా పోయారేంటి అనుకుంటున్న సమయంలో సడన్ ఎంట్రీ లు ఇచ్చి షాక్ కి గురి చేస్తున్నారు. కొందరు స్పెషల్ రోల్ లో దర్శనమిస్తుంటే మరి కొందరు మెయిన్ లీడ్ లో కొత్త తరహా కథలతో వాస్తు.. ఇంకా మా మార్కెట్ అలానే ఉందని గుర్తు చేస్తున్నారు.
నాలుగు పదుల వయసొచ్చినా ఇంకా స్టామినా తగ్గలేదు అన్నట్టుగా నటిస్తున్న వారిలో జ్యోతిక కూడా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ని వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిక సినిమాలు తగ్గించేసి కుటుంబంతో హాయిగా గడిపేది. అయితే ఈ మధ్య కోలీవుడ్ లో భర్త సపోర్ట్ తో నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఒకే చేస్తూ.. శభాష్ అనిపించుకుంటోంది. 2015లో ఓ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి తర్వాత మళ్ళీ ఏ సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం అమ్మడు రెండు సినిమాల్లో బిజీగా ఉంది. ఒకటి విలక్షణ దర్శకుడు బాల నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న "నాచియర్" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. అలాగే ఆ సినిమాలో ప్రముఖ యువ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కూడా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.
అంతే కాకుండా సూర్య నిర్మిస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తోంది. ఇప్పుడు ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలతో పాటు రీసెంట్ గా జ్యోతికను మణిరత్నం తన నెక్స్ట్ సినిమాలో ఒక సెంట్రల్ క్యారెక్టర్ కి సెట్ చేసుకున్నాడట. ప్రస్తుతం మణిరత్నం ఆ సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులను ఎంపికపై కసరత్తు చేస్తున్నాడు. చూడాలి మరి అమ్మడు ఈ మూడు సినిమాల్లో ఎలా దర్శనం ఎవ్వనుందో..