బాహుబలి2 చూసిన డొనాల్డ్ ట్రంప్

Update: 2017-05-12 14:57 GMT
బాహుబలి ది కంక్లూజన్ కు కొనసాగింపుగా రూపొందిన మూవీ బాహుబలి2 మూవీ.. ఇప్పటికే పలు తిరుగులేని రికార్డులు సృష్టించి.. వాటిని రోజూ సవరిస్తూనే ఉంది. ఈ మూవీని చూసేందుకు దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎగబడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ను ఎప్పుడో దాటేసిన ఈ మూవీ.. అమెరికాలో ఇప్పటికే 110 కోట్ల రూపాయలను కొల్లగొట్టిందంటే.. అక్కడి జనాలు ఏ స్థాయిలో చూస్తున్నారో అర్ధమవుతుంది.

అయితే.. బాహుబలి2 చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చూశారట. అది కూడా సినిమా రిలీజ్ అయిన రెండో రోజే కావడం మరీ విశేషంగా చెప్పాలి. ఈ విషయాన్ని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా.. ప్రపంచాన్ని తానే నడిపిస్తున్నాని చెప్పుకునే ధైర్యం గల ది వన్ అండ్ ఓన్లీ పర్సన్ కె.ఎ. పాల్. బాహుబలి2 చిత్రాన్ని చూశానని.. ట్రంప్- ఆయన కూతురు ఇవాంక ఇద్దరూ సినిమా బాగా ఎంజాయ్ చేశారని.. పాల్ ట్విట్టర్ పేజ్ లో ఏప్రిల్ 28నే పోస్ట్ చేయడం విశేషం. ఇలాంటి అద్భుతాన్ని సాక్షాత్కారం చేసినందుకు.. కె ఏ పాల్ కు ట్రంప్ అభినందనలు కూడా చెప్పాట.

అంతా బాగానే ఉంది కానీ ఈయన వేసే జోకుల్లో ఇదీ ఒకటి అనుకోవాల్సిందే. ట్రంప్ కనుక ఇండియన్ మూవీ చూసి ఉంటే.. అది ఇప్పటికే పెద్ద న్యూస్ అయేది. మరోవైపు ఈ సినిమాను సాక్షాత్కారం చేయడంలో కె ఏ పాల్ పాత్ర ఏంటో ఆయనకే తెలియాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News