పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ...! అన్నాడు సుమతీ శతకకారుడు. తనయుడు పెద్ద గాయకుడిగా రాణిస్తూనే.. సంగీత దర్శకుడిగా టర్న్ తీసుకుని అద్భుతాలే చేస్తున్నాడు. పని చేసిన మొదటి సినిమాతోనే అతడు క్వాలిటీ మ్యూజిక్ డైరెక్టర్ గా తండ్రికి మించిన గ్రేట్ బీజీఎం ఇచ్చిన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. రీరికార్డింగులో తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఇంతకీ ఎవరాయన? అంటే ఎం.ఎం.కీరవాణి వారసుడు కాల భైరవ.
బాహుబలి-2లో దండాలయ్యా పాటతో.. అరవింద సమేతలో పెనివిటి పాట తో గాయకుడిగా అతడేంటో తెలిసిపోయింది. తర్వాత `మత్తువదలరా` సినిమాతో సంగీత దర్శకుడిగా నిరూపించుకున్నాడు. అయితే అది సరిపోతుందా? అంటే అబ్బే.. తెలుగు ఆడియెన్ అంతకంటే అడ్వాన్స్ డ్ గా ఆలోచిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్- హ్యారిస్ జైరాజ్- యువన్ శంకర్ రాజా .. వీళ్ల వరసలో బెస్ట్ అన్న పేరు తెచ్చుకోవాలి అతడు కూడా. ఇక ఆర్.ఆర్ పరంగా డన్ కిర్క్.. ఇన్సెప్షన్ రేంజులో వర్కవుట్ చేసే సత్తాని సంగీత దర్శకుడిలో కోరుకుంటున్నారు మరి.
టాలీవుడ్ లో ఇన్నాళ్లు ఎందరు సంగీత దర్శకులు పుట్టుకొచ్చినా పెద్ద రేంజు చూపించలేకపోయారు. ఎవరి పేరు అంతగా నోటెడ్ కాలేకపోయింది. అందుకే టాలీవుడ్ కి మ్యూజిక్ పరంగా ఒక వేవ్ కావాలి. హాలీవుడ్ రేంజు అవసరం లేకపోయినా .. క్వాలిటీ ఆర్.ఆర్. తో అదరగొట్టే సత్తా అవసరం. అయితే అందరూ రెహమాన్ లే అయిపోవాలంటే కష్టం కానీ.. చేసిన ప్రతి సినిమాకి క్వాలిటీ వర్క్ ఇచ్చి.. సత్తా చాటాల్సి ఉంటుంది. ఇక చెత్త ట్యూన్లు ఇచ్చేకంటే సినిమాలకు పని చేయకపోవడమే ఉత్తమం అన్న ప్రాతిపదికన కాలభైరవ పని చేస్తాడనే భావిద్దాం. ప్రస్తుతం ఈ యువ సంగీత దర్శకుడు వరుసగా సినిమాలకు పని చేస్తున్నాడు. కలర్ ఫోటో... గుర్తుందా శీతాకాలం.. సిద్ధు నటిస్తున్న వేరొక కొత్త చిత్రం ఇవన్నీ భైరవ ఖాతాలో పడ్డాయి. నెమ్మదిగా అగ్ర హీరోల సినిమాలకు అతడు ఎదిగేసేందుకు ఆస్కారం ఉంది వీటితో నిరూపించుకుంటే. చరణ్.. బన్ని.. తారక్.. మహేష్.. పవన్ లాంటి స్టార్లు పిలిచి అవకాశాలిచ్చే రేంజుకు కాల భైరవ ఎదిగేస్తాడనే భావిద్దాం.