సినిమా దెబ్బ కొట్టినా శాటిలైట్ ఆదుకుంది

Update: 2018-06-26 04:09 GMT
సౌత్ ఇండియాలో తిరుగు లేని ఇమేజ్ ఉన్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. రీసెంట్ గా ఆయన హీరోగా నటించిన కాలా సినిమా బాక్సాఫీసును పెద్దగా ఆకట్టుకోలేదు. ముంబయిలోని ధారావి బ్యాక్ గ్రౌండ్ గా నడిచే అండర్ కరెంట్ పొలిటికల్ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. పా. రంజిత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని ఆయన అల్లుడు.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ ప్రొడ్యూస్ చేశాడు.

మామగారి సినిమాయే కదా అని కాలా కోసం ధనుష్ పాపం బాగానే ఖర్చు పెట్టాడు. తీరా చూస్తే అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు పెద్దగా డబ్బులు రాలేదు. ఓవరాల్ గా నష్టాలు తప్పవనుకుంటున్న ధనుష్ కు శాటిలైట్ రైట్స్ రూపంలో లక్కు కలిసొచ్చింది. కాలా శాటిలైట్ హక్కులను సౌత్ లోని పెద్ద టీవీ నెట్ వర్క్ సన్ టీవీ రూ. 60 కోట్లకు పైగా దక్కించుకుందని కోలీవుడ్ టాక్. తమిళం - తెలుగు - హిందీ భాషలు మూడింటికి కలిపి ఈ మొత్తం సన్ టీవీ చెల్లిస్తోందని తెలిసింది. ఒక్కసారే మొత్తం సెటిల్ మెంట్ అయిపోవడం ధనుష్ కూ ఆనందాన్నిచ్చిందే.

వరసగా ఫ్లాపులు ఎదురైనా ప్రేక్షకుల్లో రజనీ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టీవీ ల్లో సూపర్ స్టార్ పాత సినిమా వస్తున్నా ఇంట్రస్టింగ్ గా చూస్తారు. అందుకే సన్ టీవీ అమౌంట్ కాస్త ఎక్కువైనా కాలా రైట్స్ కు కొనుగోలు చేసింది. ఈ సినిమాలో రజనీ భార్యగా ఈశ్వరీ రావు నటించగా.. ప్రియురాలి పాత్ర బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ చేసింది. విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటించాడు.


Tags:    

Similar News