పిశాచి 2 : కాల‌మెంత వేగ‌ములే

Update: 2022-07-13 07:29 GMT
2014 లో మిస్క‌న్ తెర‌కెక్కించిన మిస్ట‌రీ హీర‌ర్ థ్రిల్ల‌ర్ 'పిశాచి'. నాగ సాయి ప్ర‌తీష్‌, ప్ర‌యాగ మార్టీన్ జంట‌గా న‌టించిన ఈ గోతిక్ హార‌ర్ మూవీ అప్ప‌ట్లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్నిసాధించింది. హార‌ర్ సినిమాల్లో స‌రికొత్త థ్రిల్ల‌ర్ గా నిలిచిన ఈ సినిమాకి ఇన్నేళ్ల త‌రువాత మ‌ళ్లీ సీక్వెల్ ని చేస్తున్నారు. 'పిశాచి 2' పేరుతో రూపొందుతున్న ఈ మూవీని కూడా మిస్కిన్ తెర‌కెక్కిస్తున్నారు. ఆండ్రియా టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది.

ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో పూర్ణ‌, సంతోష్ ప్ర‌తాప్ న‌టిస్తున్నారు. రాక్ ఫోర్ట్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై టి. మురుగ‌నాథ‌మ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. హార‌ర్ చిత్రాల్లో ప్ర‌త్యేక‌త‌ని చాటుకుని షాక్ గురించి చేసిన ఈ మూవీని తెలుగులో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రిలీజ్ చేస్తున్నారు.  

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఇక రీసెంట్ గా విడుద‌ల చేసిన టీజ‌ర్ షాక్ కు గురిచేసివంది.

రెడ్ క‌ల‌ర్ థీమ్ లో విడుద‌ల చేసిన టీజ‌ర్ ఒళ్లు గ‌గుర్పొడిచే స‌న్నివేశాల‌తో సాగుతూ షాక్ కు గురిచేసింది. ఈ టీజ‌ర్ లో హీరోయిన్ ఆండ్రియా న్యూడ్ గా క‌నిపించడంతో అంతా ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు. ఇంత సాహ‌సం ఎందుకు చేసింది అంటూ స‌ర్వ‌త్రా ఈ మూవీపై చ‌ర్చ కూడా మొద‌లైంది. త్వ‌ర‌లోనే ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ గా 'కాల‌మెంత వేగ‌ములే' అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని బుధ‌వారం విడుద‌ల చేశారు.

పోతుల ర‌వికిర‌ణ్ ఈ పాట‌కు సాహిత్యం అందించారు. కార్తిక్ రాజా సంగీతం అందించిన ఈ పాట‌ని సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించారు. మెలోడీ ప్ర‌ధానంగా సాగే ఈ పాట విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఆండ్రియా విభిన్న‌మైన పాత్ర‌లో న‌టించిన 'పిశాచి 2' కూడా సంచల‌న విజ‌యాన్ని సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తోందని చెబుతున్నారు.


Full View

Tags:    

Similar News