కబాలి.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ మూవీపై బోలెడంత హైప్ - అంతకుమించిన ఎక్స్ పెక్టేషన్స్. సినిమా రిలీజ్ రోజునే అందరికీ విషయం అర్ధమైపోయింది. కొచ్చాడయాన్.. లింగాలకు మించి కబాలి నిరాశపరిచేసింది. అయితే.. ఈ సంగతి ముందే తెలిసిన నిర్మాత.. వీలైనంత వరకూ అడ్వాన్సులతో పిండేశాడు. చాలా ఏరియాల్లో ఈ స్ట్రాటజీ బాగానే వర్కవుట్ అయింది. అందుకే భయంకరమైన టాక్ ఉన్నా వీకెండ్స్ లో కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాతే మొదలయింది అసలు కథ.
ఓవర్సీస్ కలెక్షన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే.. వీకెండ్ ముగిసేనాటికి వచ్చిన మొత్తం 4.1మిలియన్ డాలర్లు. ఇందులో 1.93 మిలియన్లు ప్రీమియర్ కలెక్షన్సే. ఇక వారం మొత్తం ముగిసేనాటికి వసూలైన మొత్తం 4,259,819 డాలర్లు. అంటే నాలుగు రోజుల్లో కేవలం లక్షన్నర డాలర్లు వచ్చాయన్న మాట. ఇది యావరేజ్ టాక్ ఉండే లోబడ్జెట్ సినిమాలకు కూడా వసూలయ్యే మొత్తం. కబాలి బుడగ వీకెండ్ తోనే పేలిపోయిందనే విషయం అర్ధమవుతోంది.
మిగిలిన అన్ని ఏరియాల్లోనే ఇదే సిట్యుయేషన్. కాకపోతే తమిళనాడులో కొంచెం బెటర్ గా కనిపించడానికి కారణం.. అక్కడ 10 రోజుల వరకూ అడ్వాన్స్ బుకింగ్ అమ్మేశారులే. కొచ్చాడయాన్.. లింగాలకు మించిన ఫ్లాప్ అయితే.. కమర్షియల్ ఐడియాలతో కొంత బెటర్ అనిపించారంతే.