మనోళ్లందరికీ మెంటల్ తెప్పించాడు

Update: 2016-07-22 00:56 GMT
ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్స్.. ఇదో రేర్ ఫీట్.. అసాధ్యం.. అబ్బో చాలా కష్టం.. కొందరికి మాత్రమే సొంతం.. ఇలా ఉంటాయ్ మాటలు. పైగా తమిళ హీరోల కంటే మనోళ్లు సూపర్.. భారీ రిలీజ్ లు ఉంటాయ్ అనే టాక్ కూడా ఉంది. వీటిన్నిటికీ మించి.. బాలీవుడ్ తర్వాత మనమే ఓవర్సీస్ కింగ్ లు అని కూడా చెప్పేసుకుంటాం. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం మనోళ్లందరికీ మెంటల్ తెప్పించేశాడు.

అసలింకా సినిమా రిలీజ్ కానే లేదు.. కేవలం అడ్వాన్సులతో 1 మిలియన్ డాలర్‌ కలెక్షన్స్ దాటేశాడు. అది కూడా కేవలం ప్రీమియర్లతోనే. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇంకా ప్రీమియర్ల ప్రదర్శన పూర్తి కాలేదు కూడా అప్పుడే టిక్కెట్‌ కలక్షన్‌ $1,023,480 డాలర్లు దాటేయడానికి సిద్దపడింది. ఇకపోతే ప్రీమియర్ల లెక్క ఇంకా చాలానే ఉంటుందన్న మాట. ఈ లెక్కన వీకెండ్ అయ్యేసరికి కబాలి ఏ రేంజులో పిండేస్తాడో ఊహించుకోవాల్సిందే. టాక్ ఏ మాత్రం బాగున్నా సరే.. మన హీరోలనేం ఖర్మ.. బాలీవుడ్ హీరోలను కూడా దాటేస్తాడు.

ఒక్క మాటలో చెప్పుకోవాలంటే.. ప్రీమియర్లతో కబాలి హీరోలందరినీ కలిపి ఉతికి ఆరేశాడు. ఇప్పుడు రజినీ టార్గెట్ ఏంటో తెలుసుగా.. ఓవర్సీస్ లో బాహుబలి లెక్కను దాటడమే. అది కొంచెం కష్టం కావచ్చు కానీ.. బ్లాక్ బస్టర్‌ టాక్‌ వస్తే మాత్రం రజినీకాంత్ కి అసాధ్యం మాత్రం కాదు.
Tags:    

Similar News