సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అనగానే.. చాలా ఏరియాల్లో క్రేజ్ ఉంటుంది. తమిళనాడు తర్వాత అత్యధికంగా బిజినెస్ జరిగే ఏరియా తెలుగు రాష్ట్రాల్లోనే అంటే ఆశ్చర్యమేం లేదు. ఆ క్రేజ్ తో వచ్చే నెలలో విడుదల కానున్న కబాలి మూవీ కోసం 30 కోట్ల వరకూ బయ్యర్లు పెట్టుబడి పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది. నిజానికి రజినీ గత రెండు సినిమాల పెర్ఫామెన్స్ తో పోల్చితే.. ఇది చాలా చాలా ఎక్కువ.
విక్రమ సింహ - కొచ్చాడయాన్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కనీస మాత్రం కూడా పెర్ఫామ్ చేయలేదు. పెట్టిన పెట్టుబడిలో ఎవరికీ మూడో వంతు కూడా రాలేదు. కనీసం నష్టపోయిన వారిని ఆదుకునే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. అయినా సరే ఇప్పుడు భారీ మొత్తం ఇచ్చి మరీ కబాలి రైట్స్ సొంతం చేసుకున్నారు. సీడెడ్ లో 6.3 కోట్ల మొత్తం నాన్ రిఫండబుల్ అగ్రిమెంట్ చేసుకున్నారనే న్యూస్ సంచలనం కలిగిస్తోంది. వైజాగ్ 3.3 కోట్లు - గుంటూరు 3 కోట్లు - ఈస్ట్ 2.40కోట్లు - ఈస్ట్ లో 1.60 కోట్లు పెట్టేశారంటే.. కబాలికి ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది.
అయితే ఈ క్రేజ్ ఏర్పడ్డానికి ప్రధాన కారణం.. టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడమే. మరి అంత సూపర్బ్ గా టీజర్ లోని విజువల్స్ తో సరిపెడితే సరిపోదు. మూవీ మొత్తం ఆ రేంజ్ లో మాయ చేయగలిగితేనే ఈ పెట్టుబడిని తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంటుంది. దర్శకుడు పా రంజిత్ తీసిన ఈ మాఫియా బేస్డ్ స్టోరీ.. డిస్ట్రిబ్యూటర్లను ఏ ఒడ్డుకు చేర్చుతుందో అనే ఆసక్తి నెలకొంది.