కోచ్చడయాన్ (విక్రమసింహా) అభిమానుల్ని నిరాశ పరిచిందని.. ‘లింగా’ సినిమాను శర వేగంగా ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేసి రిలీజ్ చేయించాడు సూపర్ స్టార్ రజినీకాంత్. కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఐతే ‘కబాలి’ విషయంలో మాత్రం రజినీ అండ్ కో తొందరపడట్లేదు. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగానే అయిపోయింది కానీ.. ముందు స్క్రిప్టు తయారు చేయడానికి.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు బాగా టైం తీసుకుంటున్నాడు దర్శకుడు పా రంజిత్. మే మొదటి వారంలోనే విడుదలవుతుందనుకున్న ఈ సినిమా రెండు నెలలు ఆలస్యంగా జులై 1కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ డేటు పక్కా అనుకుంటుండగా ఇప్పుడు మళ్లీ సినిమా వాయిదా అంటున్నారు.
కారణం పక్కాగా ఇదీ అని చెప్పట్లేదు కానీ.. సినిమాను జులై 15కు వాయిదా వేయబోతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జులై 6న సల్మాన్ ఖాన్ సినిమా ‘సుల్తాన్’ విడుదలవతున్న నేపథ్యంలో ముందు వారం ‘కబాలి’ని రిలీజ్ చేయడం రెండు సినిమాలకూ మంచిది కాదన్న ఉద్దేశంతో డేట్ మార్చారని అంటున్నారు. మరోవైపు ‘కబాలి’ని ఇండియాలో మూడు భాషలతో పాటు జపనీస్ - మలాయ్ లాంటి విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయాల్సి ఉండటంతో డబ్బింగ్ ఇతర కార్యక్రమాలు కూడా ఆలస్యమవుతున్నాయని.. అందుకే సినిమాను వెనక్కి తీసుకెళ్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఓ మోస్ట్ అవైటెడ్ మూవీని ఇలా పదే పదే వాయిదా వేస్తూ పోవడం మాత్రం అభిమానులకు చిరాకు తెప్పించేదే. జులై 15కు వాయిదా వేస్తే వేయనివ్వండి కానీ.. కనీసం ఆ డేట్ అయినా ఫిక్స్ చేయమని అంటున్నారు ఫ్యాన్స్.