టార్చర్ పెడుతున్న కబాలి..

Update: 2016-07-01 22:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోందంటే సౌత్ ఇండియాలో అన్ని ఇండస్ట్రీల వాళ్లూ అప్రమత్తం అవుతారు. ఆయన సినిమాకు అటు ఇటు తమ సినిమాలు రాకుండా జాగ్రత్త పడతారు. అందుకే రజినీ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు ముందు నుంచి ఓ క్లారిటీతో ఉంటే బెటర్. రిలీజ్ డేట్ విషయంలో పక్కాగా లేకపోతే చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఐతే సూపర్ స్టార్ కొత్త సినిమా ‘కబాలి’ విషయంలో ఆ క్లారిటీ లేకపోవడం చాలామందిని టార్చర్ పెడుతోంది. సౌత్ లోని అన్ని ఇండస్ట్రీల మీదా ఆ ప్రభావం పడుతోంది. ముఖ్యంగా కొన్ని తమిళ-తెలుగు సినిమాలకు ‘కబాలి’తో పెద్ద చిక్కే వచ్చిపడింది.

మే 27.. జూన్ 3.. జులై 1.. జులై 15.. ఇలా కబాలి రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ముందు ఓ డేట్ ఇవ్వగానే మిగతా సినిమాలు అందుకు తగ్గట్లుగా షెడ్యూల్ అవుతాయి. అంతలోనే డేట్ మారిపోతుంది. మళ్లీ కొత్త డేటుకు తగ్గట్లుగా షెడ్యూళ్లు మారుస్తారు. మళ్లీ వాయిదా వార్త వస్తుంది. ఇలా ఇప్పటిదాకా చాలా సినిమాలు ‘కబాలి’ వల్ల ఇబ్బంది పడ్డాయి. ఐతే జులై 15న ‘కబాలి’ పక్కా అనడంతో ఆ డేట్ ప్రకారం తమ సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు కొందరు. కానీ ఇప్పుడు ఆ తేదీకి కూడా కబాలి రాకపోవచ్చంటున్నారు. దీంతో బాబు బంగారం.. సాహసం శ్వాసగా సాగిపో లాంటి పెద్ద సినిమాలతో పాటు.. కొన్ని చిన్న సినిమాలూ అయోమయ స్థితిలో పడ్డాయి. తమిళంలో కూడా చాలా సినిమాల పరిస్థితి ఇంతే. కబాలి దర్శక నిర్మాతలు ఈ కన్ఫ్యూజన్ కు తెరదించే ప్రయత్నమేమీ చేయట్లేదు. నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల  చేస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో వాళ్లకూ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ లేనట్లుంది. మరి ఈ కన్ఫ్యూజన్ తీరేదెప్పుడో?
Tags:    

Similar News