ర‌జినీ సార్.. తెలుగోళ్లు ఏం పాపం చేశారు?

Update: 2016-06-15 17:30 GMT
సూర్య చాలా లేటుగా తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ అత‌ను మ‌న ప్రేక్ష‌కుల‌కు ఇచ్చే ప్ర‌యారిటీ అంతా ఇంతా కాదు. తన సినిమాల‌ను త‌మిళంలో ఎలా ప్ర‌మోట్ చేస్తాడో.. తెలుగులోనూ అలాగే చేస్తాడు. త‌న సినిమాల‌కు సంబంధించి ఏ చిన్న విశేషాన్న‌యినా ఒకేసారి త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తాడు. ఈ మ‌ధ్య ‘24 త‌మిళ ఆడియోను ఉద‌యం చెన్నైలో రిలీజ్ చేసి.. సాయంత్రానికి హైద‌రాబాద్ లో తెలుగు ఆడియో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యాడు. ఐతే సూర్య‌తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న‌ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ మాత్రం మ‌న ప్రేక్ష‌కుల్ని త‌క్కువ‌గా చూస్తాడ‌న్న అభిప్రాయం ఉంది. మ‌న స్టార్ హీరోల‌తో స‌మానంగా ఆయ‌న్ని ఆద‌రిస్తున్నా ఇక్క‌డికి రావ‌డం.. తెలుగులో త‌న సినిమాల్ని ర‌జినీ ప్ర‌మోట్ చేయ‌డం త‌క్కువ‌.

ర‌జ‌ని లేటెస్ట్ మూవీ ‘క‌బాలి’ టీజ‌ర్ ఉద‌యం త‌మిళంలో రిలీజైంది. త‌ర్వాత రాత్రికి కానీ తెలుగు టీజ‌ర్ రిలీజ్ చేయ‌లేదు. ఇక ఆడియో సంగ‌తికొస్తే నాలుగు రోజుల ముందే చెన్నైలో సింపుల్ గా ఓ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి త‌మిళ పాట‌లు రిలీజ్ చేశారు. పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలో క‌బాలి సాంగ్స్ గురించి పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. కానీ ఇప్ప‌టిదాకా తెలుగు ఆడియో మాత్రం రిలీజ‌వ్వ‌లేదు. దాని గురించి అప్ డేట్ కూడా లేదు. ఇక్క‌డి ప్రేక్ష‌కులు మాత్రం క‌బాలి ఆడియో కోసం ఎప్పుడెప్పుడా అన్న‌ట్లు ఎదురు చూస్తున్నారు. త‌మిళ ఆడియోకు ర‌జినీ రాలేద‌నుకోండి. అది వేరే సంగ‌తి. తెలుగు ఆడియో వేడుక‌కు కూడా ఆయ‌న రాక‌పోయినా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పాట‌లు విడుద‌ల‌య్యేలా చూడాలి క‌దా.
Tags:    

Similar News