కబాలి.. ప్రస్తుతం సౌతిండియా మొత్తం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. జూలై 15న విడుదల కానున్న ఈ రజినీకాంత్ మూవీ కోసం అన్ని ఇండస్ట్రీలోనే ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటివరకూ కనిపించలేదు. కారణం స్పష్టంగా తెలియడం లేదు కానీ.. ఈ నెల ప్రారంభంలో జరిగిన తమిళ వెర్షన్ కబాలి ఆడియోకి కానీ.. రీసెంట్ గా జరిగిన తెలుగు కబాలి ఆడియో వేడుకకు కానీ రజినీకాంత్ డుమ్మా కొట్టేశారు.
కీలక సమయంలో రజినీకాంత్ కనిపించకపోవడం చాలామందిని కలవరపెడుతోంది. ఆయన ఆరోగ్యంపై చాలానే రూమర్లు వస్తున్నాయి. అయితే.. మొత్తానికి తెలుగు వెర్షన్ కబాలి ఆడియో కూడా వచ్చేసింది. ఈ ఫంక్షన్ కి మూవీ టెక్నికల్ యూనిట్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు హాజరయ్యారు. 'అందరిలాగానే నేను కూడా రజినీకాంత్ గారిని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించిన వాడినే. కబాలి టీజర్-సాంగ్స్ చూస్తుంటే అప్పుడెప్పుడో చూసిన బాషా గుర్తుకొస్తోంది' అన్నాడు నేచురల్ స్టార్ నాని.
'రజినీకాంత్ చాలా సింపుల్ గా ఉంటారు. మేమంతా ఆయనకి పెద్ద ఫ్యాన్స్. ఆయన అందరికీ మంచి ఫ్రెండ్ కూడా. బాషా తర్వాత ఇలాంటి సినిమా రజినీ సార్ చేయలేదు. మళ్లీ బాషాలో రజినీకాంత్ ని చూపిస్తున్న పా రంజిత్ కి కృతజ్ఞతలు' అని చెప్పాడు మెగా హీరో వరుణ్ తేజ్. 'కబాలి సినిమాపై అంచనాలు చాలానే ఉన్నాయి. అందరి అంచనాలు నెరవేరుస్తా అనుకుంటున్నాను. తమిళ్ కంటే తెలుగులోనే గ్రాండ్ గా ఆడియో వేడుక జరపుతున్న నిర్మాతలకు థ్యాంక్స్' అన్నాడు దర్శకుడు పా రంజిత్.