సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కబాలి సెన్సేషన్స్ ఇప్పటికే నమోదైనవి చాలానే ఉన్నా.. ఇంకా నమోదు కావాల్సినవి బోలెడన్ని ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక లెక్క జనాలు తేలుస్తారు కానీ.. ముందు పబ్లిసిటీ విషంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. ఇండియాలో బిగ్గెస్ట్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ప్రమోషన్స్ లో కూడా కొత్త రికార్డులు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
తెలుగు డబ్బింగ్ వెర్షన్ కే 30 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఈ చిత్రానికి మరింత హైప్ తెచ్చేందుకు పబ్లిసిటీలో వినూత్నమైన పద్ధతులు అవలంబించేందుకు కబాలి యూనిట్ రెడీ అయింది. ప్రమోషన్స్ లో ఎక్కడా రాజీ పడకుండా.. బస్సులు - రైళ్లలో చాలావరకు రజినీ పోస్టర్లతో నింపేయనున్నారు. అలాగే.. నాలుగు ఫ్లైట్లను కూడా రెంట్ కి తీసుకోవడం విశేషం.
ఫ్లైట్ల పై భాగాన్ని కబాలి పోస్టర్ తో కప్పేసేలా డిజైనింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు డొమెస్టిక్, రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు ఫుల్ బాడీ పోస్టర్స్ వేయనున్నారు. గతంలో ఇలాంటి పబ్లిసిటీ హాలీవుడ్ మూవీ హాబిట్ చిత్రానికి చేశారు. ఇప్పుడీ రూట్ పడుతున్న తొలి మూవీగా రజినీకాంత్ కబాలి రికార్డ్ సృష్టించనుంది.