ది గ్రాండ్ రెక్స్.. యూరప్ లోనే అతి పెద్ద థియేటర్. ప్యారిస్ లోని ఈ భారీ థియేటర్లో సినిమా చూడటాన్ని చాలా ప్రెస్టీజియస్ గా ఫీలవుతారు అక్కడి జనాలు.. టూరిస్టులు. వెయ్యిలోపు సీట్లుండే ఐమాక్స్ తెర గురించే మనం గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది ‘ది గ్రాండ్ రెక్స్’లో ఏకంగా 2800 సీట్లుంటాయి. తెర ఎక్కడో దూరంగా ఉంటుంది. కానీ చాలా భారీగా ఉంటుంది. ఇంద్ర భవనం లాంటి ఆ థియేటర్లో అద్భుతమైన సౌకర్యాల మధ్య సినిమా చూడటం గొప్ప అనుభూతి.
ఈ మధ్యే మన రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి’ని వారం రోజుల పాటు ఈ థియేటర్లో ప్రదర్శించారు. చాలా మంచి స్పందనే వచ్చింది. తాజాగా మరో సౌత్ ఇండియన్ మూవీ ఈ ప్రెస్టీజియస్ థియేటర్లో ప్రదర్శనకు రాబోతోంది. ఈ సినిమా మరేదో కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’. వచ్చే నెల 15న విడుదల కాబోతున్న ‘కబాలి’ని ‘ది గ్రాండ్ రెక్స్’లో ప్రదర్శించబోతున్నారు. ‘బాహుబలి’ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగాక.. సినిమా విడుదలైన 11 నెలలకు నెలలకు అక్కడ ప్రదర్శితమైంది.
కానీ ‘కబాలి’ని నేరుగా అక్కడ రిలీజ్ చేస్తుండటం విశేషమే. సూపర్ స్టార్ ప్రభ ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరిస్తోందో చెప్పడానికి ఇది రుజువు. అంత పెద్ద స్క్రీన్ మీద సూపర్ స్టార్ విశ్వరూపం చూసే అభిమానుల ఆనందానికి ఇక అవధులుంటాయా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 దేశాల్లో ‘కబాలి’ ఒకేసారి విడుదల కాబోతుండటం విశేషం. తమిళం-తెలుగు-హిందీతో పాటు మళాయ్ (మలేషియా భాష).. జపాన్ భాషల్లోనే ‘కబాలి’ని రిలీజ్ చేయబోతుండటం విశేషం.