కబీహ్ దుహాన్ సింగ్.. జిల్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మోడల్.. ఇప్పుడు టాలీవుడ్ కి ఫ్యావరేట్ విలన్ అయిపోయాడు. కబీర్ చేతిలో 11 సినిమాలు ఉన్నాయంటే.. ఈ విలన్ కి ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ విలన్ గా కబీర్ నే తీసుకున్నారు. టాలీవుడ్ తనను ఇంతగా ఆదరించడంపై ఫుల్లు ఖుషీగా కబీర్.. ఇప్పుడు వచ్చే ఏడాదికి సంబంధించిన షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నాడు.
"నేనిక్కడి వాడిని కాకపోయినా.. టాలీవుడ్ నన్ను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నన్ను తమ మనిషిగా భావించి.. బోలెడు ఆఫర్స్ ఇస్తున్నందుకు థాంక్స్" అంటున్నాడు కబీర్. ఇతడు నటించిన వాటిలో చివరగా రిలీజ్ అయిన మూవీ అజిత్ నటించిన వేదాలం. ఈ చిత్రంతో కోలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. విలన్ గానే చేస్తున్నందుకు ఫీల్ కావడం లేదంటున్న కబీర్.. అసలు విలన్ కేరక్టర్ లేకపోతే థ్రిల్ ఏముంటుందని ప్రశ్నిస్తున్నాడు. స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకోవడం మాత్రం ఆనందాన్నిస్తోందని చెప్పాడు కబీర్. అయితే ఇందుకు తాను మోడల్ కావడం కలిసొచ్చిందని అంటున్నాడు.
తన కర్లీ హెయిర్ - జీన్స్ ప్యాంట్స్ తో కనిపించే డ్రెసింగ్ ను మోడలింగ్ తో పాటు సినిమాల్లో కంటిన్యూ చేస్తున్నానని.. అదే తనకు ప్లస్ అయిందన్నాడు కబీర్. ప్రస్తుతం ఆఫర్స్ చాలానే ఉన్నాయని.. వీటిలోంచి చాలా జాగ్రత్తగా ఎంచుకుని, సినిమాలు చేస్తున్నట్లు చెప్పాడు. కేరక్టర్లకు పర్సనల్ టచ్ ఇవ్వడంతోనే.. విలన్ పాత్రలను పండించగలుతున్నట్లు చెప్పడం విశేషం.