టాలీవుడ్ - కోలీవుడ్ లలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ విలన్ కబీర్ దుహాన్ సింగ్. వరుస విజయాలు, లెక్కకు మించిన ఆఫర్లు, భారీ చిత్రాల్లో ఆఫర్లతో దూసుకుపోతున్నాడు ఈ జిల్ విలన్. ఒకే ఏడాది రెండు భాషల్లో టాప్ స్టార్లతో చేసే అవకాశం దక్కడం కూడా చిన్న విషయమేమీ కాదు. కోలీవుడ్ లో అజిత్ తో వేదాళం చిత్రంలో నటించిన కబీర్, ఇప్పుడు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విలన్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్నాడు.
'ఈ ఇద్దరు స్టార్స్ తో నటించడం ఎప్పుడూ స్పెషలే. నేను ఈ షూటింగ్ లలో చాలా నేర్చుకున్నా. ఇంకా చెప్పాలంటే అజిత్ సార్ - పవన్ సార్ లు నాకు అన్నయ్యల్లా అనిపించారు. పెద్ద స్టార్స్ అయినా సరే చాలా సింపుల్ గా ఉండే మనస్తత్వం వారిద్దరిదీ. సహ నటులతోనే కాకుండా.. సెట్స్ లో ఉన్నఅందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్లు' అని చెప్పాడు కబీర్.
పవన్ ని అన్నయ్య అంటూనే.. త్వరలో ఫైటింగ్ చేయబోతున్నట్లు చెప్పాడు కబీర్. సర్దార్ లో పవన్ కి, ఈ విలన్ కి పోటాపోటీ ఫైటింగ్స్ ఉన్నాయట. వీటిని త్వరలో షూటింగ్ చేయబోతున్నారని, వాటి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు కబీర్. అయితే.. ఈ కబీర్ దుహాన్ సింగ్ కెరీర్ లో తొలిసారిగా గరం రూపంలో ఫ్లాప్ ఎదురైంది. కొంచెం ఫీల్ అయినా.. కెరీర్ లో సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ కూడా తప్పదని సరిపెట్టుకున్నాడట.