ధనుష్ ఆ మాట చెబితే పోరాటం ఆపేస్తారట

Update: 2017-04-10 10:56 GMT
ధనుష్ ఎవరి కొడుకు నే విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మధురైకి చెందిన కదిరేశన్ దంపతులు ధనుష్ తమ కొడుకంటూ చేసిన ఆరోపణలు చూస్తే మొదట్లో ఇదేదో సిల్లీ వ్యవహారమనే అనుకున్నారంతా. కానీ ఈ కేసు మద్రాస్ హైకోర్టు వరకు చేరింది. కొన్ని నెలలుగా విచారణ జరుగుతోంది. పుట్టుమచ్చల పరిశీలన జరిగింది. సర్టిఫికెట్లు పరిశీలించారు. వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. కానీ ఇప్పటిదాకా ఏ స్పష్టతా రాలేదు. కేసును ఇటీవలే మరోసారి వాయిదా వేసింది కోర్టు. ఇక చివరి అంకం అయిన డీఎన్ ఏ టెస్టులు చేస్తే తప్ప దీనిపై ఒక క్లారిటీ వచ్చేలా లేదు.

ఇలాంటి తరుణంలో ఓ తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన ప్రకటన చేశారు కదిరేశన్ దంపతులు. ధనుష్ తమ కొడుకు కాదని ఒప్పుకునేందుకు అతడికే మనసు రావడం లేదని.. అందుకే ఈ కేసు విషయమై అతను మౌనం వహిస్తున్నాడని వారన్నారు. ఒకవేళ ధనుష్ మౌనం వీడి.. అతను తమ కొడుకు కాదు అని స్టేట్మెంట్ ఇస్తే.. తాము ఈ పోరాటాన్ని ఆపేస్తామని వారు ప్రకటించారు. ఈ వయసులో ఎవరినో తమ కొడుకు అని చూపించి.. డబ్బులు లాగాలన్న దౌర్భాగ్య పరిస్థితిలో తాము లేమని వారన్నారు. ధనుష్ ‘పొల్లాదవన్’ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూ ఇస్తున్నపుడు అతడిని చూసి.. తమ కొడుకులాగే ఉన్నాడని అనుకున్నామని.. ఆ ఇంటర్వ్యూలో తాను మధురైకి చెందిన వాడినని.. ప్లస్ వన్ తర్వాత చదువు మానేశానని ధనుష్ చెప్పినట్లు వారు ఆరోపించారు. తమ నెత్తురు పంచుకుని పుట్టిన బిడ్డ తాము ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తుంటే భరించలేకపోతున్నామని.. డీఎన్ఏ పరీక్ష చేయిస్తే అసలు నిజాలు బయటపడతాయని వారు స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News