ఎం.ఎస్. ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కైరా అద్వానీ ప్రస్తుతం తన హవాను ఏ మాత్రం తగ్గించడం లేదు. వరుస ఆఫర్లను అందుకుంటూ అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బిజీ అవుతోంది. మొన్నటి వరకు బాలీవుడ్ కె పరిమితమైన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ పై కూడా కన్నేసింది. ఇప్పటికే భరత్ అనే నేను సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా వచ్చే నెల 20న రిలీజ్ కానుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. కైరా అద్వానీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తనకు అర్థమైన కొన్ని విషయాలని బయటపెట్టింది. 'మహేష్ బాబు ఒక పెద్ద స్టార్ కన్నా మన ముందు ఒక నార్మల్ పర్సన్ గా కనిపించడానికి ఇష్టపడతారు. ఆయన పక్కన ఉన్న వాళ్లు చాలా హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి మహేష్ నవ్వారు అంటే సెట్ లో అందరు నవ్వేస్తారు. ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారు. ఇతరులను కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు. వర్క్ విషయంలో చాలా ప్రొఫెషనల్. ఈ రోజు వరుసగా ఐదు సన్నివేశాలు చేయాలంటే.. లంచ్ కి వెళ్లకూడదు అని చెప్పేస్తే ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
ఆ ఆలోచన ఆయనపై గౌరవాన్ని పెంచింది. మంచి గుణంగల వ్యక్తి' అంటూ కైరా అద్వానీ మహేష్ గురించి గొప్పగా చెప్పింది. ఇక సౌత్ లో మంచి సినిమాలు తెరకెక్కుతాయని, పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలను ఒకే చేస్తాను అని చెబుతూ.. పెద్ద స్టార్స్ తో సినిమా చేస్తే హీరోయిన్ కి ప్రాధాన్యత ఉండదు అనుకోవడం చాలా బాధాకరమైన విషయమని.. బాహుబలి దానికో ఓ సమాధానమని కైరా అద్వానీ తెలిపింది.