వ‌హ్వా.. క్యా బాత్ హై కాజ‌ల్‌

Update: 2016-04-10 04:19 GMT
చుట్టూ న‌లుగురు పోగ‌వ‌గానే హీరోయిన్లు ప‌రిగెత్తుకొంటూ వెళ్లి కార్‌ లోనో - కార్‌ వ్యాన్‌ లోనో దాక్కుంటుంటారు. బ‌య‌టికి వెళ్లాలంటే  చుట్టూ బౌన్స‌ర్లే. ఆడియెన్స్‌ తో అస‌లు అంటీ ముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.  అయితే నవ‌త‌రం హీరోయిన్లు మాత్రం అందుకు భిన్నంగా మెలుగుతున్నారు.  అభిమానుల‌తో క‌ల‌వ‌డంలో ఎలాంటి అభ్యంత‌రం లేదంటున్నారు. అనుష్క అయితే బ‌య‌టికి ఎప్పుడు వెళ్లినా ఒంట‌రిగానే వెళుతుంది. ముసుగు కూడా వేసుకోదు. కాజ‌ల్ కూడా అంతేనట‌. ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కి వెళ్ల‌డంలో, అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ అవ్వ‌డంలోనూ  ఎలాంటి అభ్యంత‌రం లేదంటోంది. 

``అభిమానం కంటే మించింది ఏముంది? న‌లుగురు గుర్తించి ఆద‌రించ‌డం కంటే గొప్ప  విష‌యం ఏముంటుంది?  అభిమానులు చూస్తార‌ని  ముగుసు వేసుకొని తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. ఫ్యాన్స్ అడిగితే ఏం అడుగుతారు, మ‌హా అంటే ఓ ఫొటో అడుగుతారు`` అని చెప్పుకొచ్చింది. కాజ‌ల్‌లాంటి ఒక స్టార్ క‌థానాయిక ఇలాంటి మాట‌లు వ‌స్తే అభిమానులకి అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది?  వాళ్ల హృద‌యం మ‌రింత విశాల‌మ‌వుతుంది. ఆ  హృద‌యంలో కాజ‌ల్‌కి మ‌రింత పెద్ద గుడి క‌ట్టేస్తారు. ఇటీవ‌లే స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్‌ లో ఆర్షి అనే యువ‌రాణి పాత్ర‌లో న‌టించింది కాజ‌ల్‌. అందులో నిజంగానే రాణిలాగే క‌నిపించింది. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ తో క‌లిసి న‌టించ‌డం గురించి కాజ‌ల్ సంతృప్తి వ్య‌క్తం చేసింది. ఎప్ప‌ట్నుంచో ఎదురు చూస్తున్న అవ‌కాశం స‌ర్దార్ వ‌చ్చింద‌ని ఆనందం వ్య‌క్తం చేసింది. ``రామ్‌ చ‌ర‌ణ్‌ కీ - ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ కీ చాలా వ్య‌త్యాస‌ముంది. రామ్‌ చ‌ర‌ణ్ బాగా మాట్లాడ‌తాడు. ప‌వ‌న్ మాత్రం చాలా రిజ‌ర్వ్‌ డ్‌ గా ఉంటాడు. ప‌వ‌న్‌ తో నేనే మాట‌లు క‌లిపేదాన్ని. ఆయ‌న‌తో సెట్‌ లో  ఎక్కువ‌గా మాట్లాడింది నేనే`` అని చెప్పుకొచ్చింది కాజ‌ల్‌.
Tags:    

Similar News