బాలీవుడ్ హీరోయిన్ తనూశ్రీ దత్తా ఎప్పుడైతే నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిందో అప్పటి నుండి బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో మీటూ ఉంది. తాజాగా ఇండియాలో కూడా సినీ తారలు మీటూ ఉద్యమంను ఉదృతంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. బాలీవుడ్ నుండి ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ మీటూకు మద్దతుగా ప్రకటించారు. తాజాగా టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్స్ కూడా మీటూ అంటూ సోషల్ మీడియాలో లైంగిక వేదింపుల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నారు.
కొన్ని నెలల క్రితం శ్రీరెడ్డి ఇలాంటి లైంగిక వేదింపుల రోపణలను కొంతమంది టాలీవుడ్ స్టార్స్ పై చేసిన సమయంలో ఏ ఒక్క స్టార్ హీరోయిన్ కూడా స్పందించలేదు. ఒక వేళ స్పందించినా కూడా శ్రీ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడారు. తెలుగు సినిమా పరిశ్రమలో అలాంటివి ఏమీ లేవని, అసలు తెలుగు సినిమా పరిశ్రమలో తమకు ఆ అనుభవం ఎప్పుడు ఎదురు కాలేదు అంటూ రకుల్ వ్యాఖ్యలు చేయడంతో శ్రీరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇద్దరి మద్య మాటల యుద్దం జరిగింది.
తాజాగా లైంగిక వేదింపులకు వ్యతిరేకంగా మాట్లాడకుంటే నేరమే అంటూ సోషల్ మీడియాలో మీటూ ఉద్యమంలో పాలు పంచుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు కాజల్ అగర్వాల్ కూడా మీటూ అంటూ సోషల్ మీడియా ద్వారా ముందుకు వచ్చింది. మహిళలు లైంగిక వేదింపులకు పాల్పడటం ఎప్పటి నుండో ఉంది, కాని ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇలాంటి ఉద్యమం ఒకటి రావడం హర్షనీయం అంటూ మహిళ సంఘాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.