ఆచార్య... కన్నీరు పెట్టుకున్న కాజల్‌ అభిమాని

Update: 2022-04-30 09:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా లో చరణ్‌ కీలక పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించగా... చిరంజీవి కి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించింది. కాని కాజల్‌ అగర్వాల్‌ పాత్రను తొలగించారు. ఆచార్య సినిమా షూటింగ్‌ లో కాజల్‌ పాల్గొన్న విషయం అందరికి తెల్సిందే.

ఆచార్య సినిమాలో కాజల్‌ పాత్రను తొలగించామని దర్శకుడు కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. లాహే లాహే పాటలో మాత్రం కాజల్ ఉండే అవకాశం ఉందని అంతా భావించారు. పాట నుండి తొలగించే అవకాశం ఉండదు.. పాటలో ఆమె షాట్స్ ను గెస్ట్‌ అప్పియరెన్స్ గా కొనసాగించే అవకాశం ఉందని అంతా భావించారు. లిరికల్‌ సాంగ్ విడుదల అయిన సమయంలో కాజల్‌ కనిపించిన విషయం తెల్సిందే.

ఆమాత్రం అయిన సినిమా లో కాజల్ కనిపిస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కాని కాజల్‌ ను పాటలో కూడా కనిపించకుండా చేశారు. ఆచార్య సినిమాలో అసలు కాజల్‌ ఊసే కనిపించలేదు. ఆమె ఒక్క సెకను కూడా ఎక్కడ కూడా కనిపించక పోవడంతో ఆమె అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చూడని కొందరు ఆచార్య సినిమాలో కాజల్ అందనే నమ్మకంతో థియేటర్‌కు వెళ్లారు.

సినిమా లో కాజల్‌ లేక పోవడంతో చాలా మంది షాక్ అవుతున్నారు. కాజల్‌ లేదు అనే విషయాన్ని ప్రముఖంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచారం చేయలేదు. లాహే లాహే పాటలో ఆమె ఉంటుందా అని ప్రశ్నించిన సమయంలో మీరే చూడండి అంటూ దర్శకుడు కొరటాల శివ సమాధానం ఇచ్చాడు. దాంతో ఆయన సస్పెన్స్ కు కారణం ఆమె ఉండే ఉంటుందని అంతా భావించారు.

కాజల్‌ అభిమానులు ఆమె కనిపించక పోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అభిమాని సినిమా చూసి బయటకు వచ్చి కాజల్‌ ఏది భయ్యా అంటూ కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాజల్‌ లేకపోవడం ఏంటి భయ్యా అంటూ ఆ అభిమాని బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లుగా చాలా మంది కూడా కాజల్ లేదు అంటూ అవాక్కవుతున్నారు.

కనీపం ఐటెం సాంగ్ లో హీరోయిన్ ను ఉంచినట్లుగా లాహే లాహే పాటలో ఆమెను ఉంచినట్లయితే అభిమానలు ఆనందించేవారు. చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ అంటే ఇప్పటికి పడి చచ్చే వారు ఎంతో మంది ఉంటారు. అలాంటి అభిమానులు ఆచార్య సినిమా విషయంలో తీవ్ర  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం మరో రకంగా రియాక్ట్‌ అవుతున్నారు.
Tags:    

Similar News