మెగా హీరో దగ్గర అమ్మడు అడ్వాన్స్ కూడా తీసుకుందట..!

Update: 2020-05-03 16:30 GMT
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'ఇండియన్ 2' మరియు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా 'ఆచార్య' సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. 'ఆచార్య'  సినిమా కోసం కాజల్ ఇచ్చిన డేట్స్ లాక్ డౌన్ కారణంగా వృధా అయ్యాయని.. అదే సమయంలో తమిళ్ హీరో ఉదయనిధి స్టాలిన్ తో కాజల్ ఒక సినిమా చెయ్యాల్సి ఉండి అక్కడ అడ్వాన్స్ కూడా తీసుకుందని.. మెగాస్టార్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో వేరే ఆప్షన్ లేక సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిషను సెలెక్ట్ చేయగా ఆమె అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకొని షాకిచ్చింది. ఇప్పుడు తాజాగా కాజల్ అగర్వాల్ తప్పుకుందంటూ వార్తలు రావడంతో అందరూ కంగారుపడిపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ 'ఆచార్య' నుంచి తప్పుకుందనే వార్త అబద్దమని క్లారిటీ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ చెప్పుకొచ్చాడట.

ఆయన మాట్లాడుతూ ఈ న్యూస్ రూమర్ మాత్రమే.. వేరే సినిమాకి ఇచ్చిన డేట్స్ వల్ల తప్పుకుంది అనేది అవాస్తవమని.. కాజల్ ఆ సినిమాలో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇప్పటికే దీనికి సంభందించిన డాక్యూమెంట్స్ మీద సైన్ చేయడం కూడా జరిగిందని.. కొంతమేర అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగిందని.. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ లో పొల్గొనబోతోందని వివరణ ఇచ్చాడట. దీంతో కాజల్ పాప 'ఆచార్య'లో నటించట్లేదన్న రూమర్స్ కి బ్రేక్ పడినట్లే అని చెప్పవచ్చు. వాస్తవానికి కాజల్ అగర్వాల్ ఉదయనిధి స్టాలిన్ సినిమాని వదులుకునే 'ఆచార్య' మూవీకి సైన్ చేసిందట. మరి అలాంటిది ఈ సినిమా నుండి కాజల్ తప్పుకుందని న్యూస్ ఎలా స్ప్రెడ్ అయ్యిందో. కాగా కాజల్ ఇంతకముందు మెగాస్టార్ పక్కన 'ఖైదీ 150' సినిమాలో నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ - కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News