బొండు మల్లెపూలు.. బొడ్డు క్రిందకు చీర

Update: 2016-10-21 10:01 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. నేటివ్ గా తెలుగమ్మాయి కాకపోయినా మనోళ్లు ఎప్పుడో ఓన్ చేసేసుకున్నారు. కొత్తగా వచ్చిన హీరోయిన్లు కూడా తెలుగు మాటలతో మురిపిస్తుంటే.. ఇన్నేళ్ల కెరీర్ లో రెండు తెలుగు ముక్కలు నేర్చుకునేందుకు ట్రై చేయకపోయినా.. కాజల్ అంటే మనోళ్లు బోలెడంత ప్రాణం పెట్టేస్తూ ఉంటారు. చందమామ మూవీతో తెలుగించి చందమామ అయిపోయింది కానీ.. అసలీ బ్యూటీని టాలీవుడ్ కి తెచ్చిన డైరెక్టర్ తేజ.

లక్ష్మీ కళ్యాణంతో తెలుగు తెరకు పరిచయం చేశాడు. అప్పటి కృతజ్ఞతను ఇప్పుడు తీర్చుకునే అవకాశం రావడం.. పైగా హీరోగా నటిస్తోంది దగ్గుబాటి రానా కావడంతో.. ఇప్పుడు తేజ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తోంది కాజల్. ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలో షూటింగ్ జరుగుతుండగా.. స్పాట్ నుంచి కాజల్ ఫోటోలు కొన్ని బయటకొచ్చాయి. తలలో బొండు మల్లెపూలు పెట్టి.. బొడ్డు కిందకు చీర కట్టి.. ముచ్చటైన రూపంతో మిలమిలా మెరిసిపోతూ కాజల్ తెగ ఆకట్టుకుంటోంది. అచ్చ తెలుగు అందం అనేందుకు పర్యాయపదంలా తయారైపోయింది.

అల్ట్రా మోడర్న్ పాత్రలకే కాదు.. పక్కా పల్లెటూరి గెటప్ లకు కూడా సరిపోతుందని తెలుసు కానీ.. ఇలాంటి క్లాసిక్ టచ్ ఉన్న మోడర్న్ లుక్ లో కాజల్ ఇరగేసేసిందనే చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ.. సాధారణంగా తేజ సినిమాల్లో హీరోయిన్ కానీ.. వ్యాంప్ కేరక్టర్ కానీ ఇలానే ఉంటుంది. ఇక్కడ ఆ స్పాట్ లో కాజల్ ఉండడంతో కొత్తగా అనిపిస్తుంది కానీ.. తేజ సినిమాలను ఓసారి గుర్తు చేసుకుంటే మాత్రం.. అంత కిక్ రాదులే.
Tags:    

Similar News