ఒకేసారి ఇద్దరితో చందమామ

Update: 2017-05-12 17:30 GMT
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. థర్టీ ప్లస్ లోకి వచ్చాక క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటూ మెగా కంబ్యాక్ ఇచ్చిన ఈ భామ చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని సూపర్బ్ ఛాన్సులు కూడా అమ్మడి చేతిలో వాలుతున్నాయి. వీటిలో ఒక ప్రాజెక్ట్ మాత్రం భలే ఆసక్తి కలిగిస్తోంది.

చందమామ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయిన కాజల్.. కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ కళ్యాణ్ రామ్ తో కానీ.. తేజతో కలిసి పని చేయలేదు ఈ భామ. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎంఎల్ ఏ అనే మూవీ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఫైనలైజ్ చేశారనే వార్త ఆసక్తి కలిగిస్తోంది. తన తొలి హీరోతో మళ్లీ ఇప్పుడు చందమామ జట్టు కట్టడం ఒక విశేషం అయితే.. ఈ సినిమాకి దర్శకుడు తేజ కావడం మరో విశేషంగా చెప్పాలి.

అంటే ఒకేసారి కాజల్ రెండు పాత రిలేషన్స్ ను మళ్లీ మొదలుపెడుతోందన్న మాట. ఒక కాంబోను రెండో సారి రిపీట్ చేయడం అనే కాన్సెప్ట్ బాగుటుంది. అలాంటిది కళ్యాణ్ రామ్-కాజల్.. తేజ-కాజల్.. ఇలా రెండు కాంబోలను ఒకే సినిమాలో సెట్ చేసేస్తోంది చందమామ కాజల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News