కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం జరిగితే.. ఆ ఈవెంట్ మొత్తాన్ని ఒకే ఒక డ్రెస్ తో హైజాక్ చేసేసింది కాజల్ అగర్వాల్. క్లీవేజ్ చూపించుకుంటూ అమ్మడు వేసిన గెటప్... మొత్తం ఆ రోజు గూగుల్ సెర్చ్ లోనే టాప్ లోకి వచ్చేసింది. ఫుల్ క్లీవేజ్ చూపించే డ్రసింగ్ తో కాజల్ మొదటి సారి కనిపించడం.. ఫ్యాన్స్ ని బాగానే థ్రిల్ చేసింది.
కాజల్ టైపులోనే తాప్సీ పన్ను కూడా అక్కడ రెచ్చిపోయింది. తీరా ఇప్పుడు సౌత్ కోసం ఫిలింఫేర్ అవార్డులు జరిగాయి. ఇక్కడకు మాత్రం చందమామ రాలేదు. ఢిల్లీ బేబీ తాప్సీ కూడా కనిపించలేదు. బాలీవుడ్ లో వీళ్లకు చెప్పుకునే సంఖ్యలో సినిమాలు లేకపోయినా.. అక్కడకు మాత్రం రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఇక్కడ ఫంక్షన్స్ కి అయితే మాత్రం.. పిలిచినా ముఖం చాటేయడం ఈ సుందరాగులకు బాగా అలవాటు.
తాప్సీ సంగతి పక్కన పెట్టినా.. కాజల్ కెరీర్ మొత్తం టాలీవుడ్ బేస్డ్ గానే ఉంటుంది. రీసెంట్ గా కూడా సర్దార్ - బ్రహ్మోత్సవం లాంటి భారీ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. అదే బాలీవుడ్ లో అయితే చిన్నా చితకా సినిమాలతోనే సరిపెట్టుకోవాలి. టాలీవుడ్ నుంచి ఈమెకు ఇంతగా ప్రిఫరెన్స్ ఇచ్చినా.. ఫంక్షన్ల విషయంలో తెలుగు జనాలను అసలు పట్టించుకోవడం లేదు ఈ చందమామ.