సైకిల్‌ తొక్కితే కాజల్‌ మతిపోయింది

Update: 2016-05-07 09:30 GMT
తెలుగులోకి చాన్నాళ్ళ క్రితం దర్శకుడు తేజ డైరక్షన్‌ లో ''లక్ష్మీ కళ్యాణం'' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కాజల్‌ అగర్వాల్‌. ఆ తరువాత అమ్మడు స్టార్‌ చందమామ సినిమాతో తిరిగితే.. మగధీర సినిమాతో ఓ రేంజులోకి వెళ్ళిపోయింది. అయితే అప్పటి జ్ఞాపకాలు తలుచుకుంటూనే ఎంతో అద్భుతం అంటోంది అమ్మడు.

ఈరోజు సాయంత్రం బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నకాజల్‌.. తన తొలి తెలుగు సినిమా షూటింగ్‌ గురించి చెప్పుకొచ్చింది. అప్పట్లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో షూటింగ్‌ కోసం వెళ్లిందట కాజల్‌. అక్కడ ఒక సీన్లో అమ్మడు సైకిల్‌ తొక్కాలి. స్వతహాగా తండ్రి జ్యూయలరీ బిజినెస్‌ లో బాగా డబ్బున్నవారే కాబట్టి చిన్నప్పటినుండి భామకు సైకిల్‌ తొక్కిన అనుభవం లేదు. అయినాసరే.. సైకిల్‌ ను ఒక గొర్రెల మంద మధ్యలో తొక్కేసిందట. ఇంత కాన్ఫిడెంట్‌ గా ఇరగదీశాను అనుకుని.. తన ప్రయాణాన్ని కూడా అలాగే ముందుగు తీసుకెళ్లిందట. అప్పుడప్పుడూ ఆ సీన్‌ గుర్తొచ్చినప్పుడల్లా మతిపోతూ ఉంటుంది అని చెప్పింది కాజల్‌.

త్వరలోనే మరోసారి తేజ డైరక్షన్‌ లో హీరో రానా తో జతకట్టి ఈమె ఒక సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News