చెవిలో పూలు పెడుతున్న చందమామ

Update: 2016-03-24 22:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ డిఫరెంట్ గెటప్ తో దర్శనమిచ్చింది. గ్లామర్ డోస్ లిమిట్ లోనే ఉన్నా.. అమ్మడి ఎడమ చెవి వెనక తల్లో నాలుగు పూలు పెట్టుకుని వచ్చింది. ఈ పూలు ఇప్పుడు జనాల చెవిలో పెట్టడానికే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా అనేందుకు ఫిలింనగర్ జనాల దగ్గర సరైన కారణాలే ఉన్నాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ కోసం ఈ చందమామ సొంత డబ్బింగ్ చెప్పేస్తోందనే టాక్ గత కొన్నాళ్లుగా నడుస్తోంది. తొలిసారిగా తన స్వరమాధుర్యాన్ని కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయనుందనే టాక్ వినిపించింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ - తమన్నా - సమంత.. ఇలా హీరోయిన్స్ అందరూ డబ్బింగ్ బాట పట్టడంతో.. కాజల్ కూడా ఇదే రూట్ లో ఉందని అన్నారు. కానీ అమ్మడి వాలకం చూస్తే అంత సీన్ ఉన్నట్లు కనిపించడం లేదు.

సర్దార్ ఆడియో ఫంక్షన్ లో కాజల్ స్పీచ్ వింటే ఈ విషయం అర్ధమైపోతుంది. 'అందరికీ నమస్కారం' అన్న ఒక్క పదం తప్పిస్తే.. కాజల్ నోటి వెంట ఒక్క తెలుగు పదం కూడా వినిపించలేదు. కనీసం ఈ భామ తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. మరి ఏకంగా డబ్బింగ్ చెప్పేసిందంటే నమ్మడానికి.. జనాలు చెవిలో పూలు పెట్టుకుని ఉండాలి. అందుకోసం సింబాలిక్ గా నాలుగు పూలు పెట్టుకొచ్చిందన్నది అసలు కామెంట్. ఇప్పటికి అర్ధమైందా.. కాజల్ అగర్వాల్ చెవిలో పూలు పెట్టే కథ.
Tags:    

Similar News