కాజల్ కెరీర్ ప్రారంభించి దాదాపు పన్నెండేళ్లు పూర్తి కావస్తున్నా తన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సౌత్ లో తన హవా కొనసాగిస్తూనే వుంది. హిందీ పరిశ్రమను అడపాదడపా టచ్ చేస్తోంది. అందుకే హైదరాబాద్- చెన్నై- ముంబై ఇలా ఏ విమానాశ్రయానికి వెళ్లినా కాజల్ క్రేజ్ మామూలుగా వుండటం లేదు. కాజల్ కనిపిస్తే చాలా కెమెరాలు క్లిక్ మంటూ చంపేస్తున్నారు. ఈ హడావిడికి తగ్గట్టే కాజల్ కు గొడుగు పట్టేస్తూ వెంట ఒకడు హంగామా అంతే ఇదిగా ఉంది. 12ఏళ్లు పూర్తయినా చందమామాకు ఇంత క్రేజేంటి? అని మిగతా భామలు కుళ్లుకోవాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. దీనికి తగ్గట్టే కాజల్ అగర్వాల్ తెలుగు-తమిళ-హిందీ భాషల్లో కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తూ సాగుతోంది.
ప్రస్తుతం తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులో శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ రూపొందిస్తున్న `రణరంగం` ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో జయం రవితో కలిసి నటించిన `కోమలి` రజనీ ఫ్యాన్స్ కారణంగా వివాదంలో చిక్కుకుంది. వివాదాల్ని పరిష్కరించుకుని నెలాఖరు నాటికి రిలీజ్ కి వస్తోంది. ఇదే నెలలో తెలుగులో `రణరంగం` విడుదలవుతోంది. ఒకే నెలలో రెండు సినిమాలు రెండు విభిన్న భాషల్లో రిలీజవుతుంటే కాజల్ ఇటూ అటూ విమానాశ్రయాల్లో పరుగులు పెడుతోంది.
కెరీర్ పరంగా కాజల్ ఖాతాలో ఇప్పటి వరకు చెప్పుకొదగ్గ చిత్రాలే వున్నాయి. ఇకపై కూడా తన ప్రయాణాన్ని విభిన్నంగానే సాగించాలని కాజల్ ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎంత ఏజ్ వచ్చినా చందమామలో అందం చంద తరగడం లేదు. పైగా నటనలో ఎంతో పరిణతి చెందింది. అందుకే ఇలా అభిమానిస్తూ గొడుగు పడుతున్నారన్నమాట.