వేదిక ఒక్కటే .. కానీ నలుగురు భామలు పంచుకోవడం అక్కడ కొత్త కళ తెచ్చింది. సౌత్ ఇండస్ట్రీస్ కి చెందిన మేటి కథానాయికలు కాజల్, తమన్నా, సమంత, రకుల్ ఒకే వేదికపైకి వచ్చి తళుక్కుమనడం ప్రస్తుతం యువతరంలో చర్చకొచ్చింది. ప్రతి హీరోలో ఒక `హెర్` తప్పనిసరిగా ఉంటుంది! అంటూ సమంత ఇచ్చిన కొటేషన్ ని ఫాలో అయిపోయిన ఆ ముగ్గురు భామలు తనతో కలిసి కెప్టెన్ మార్వల్ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు.
చెన్నయ్ లో జరిగిన `కెప్టెన్ మార్వల్` ప్రచారంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మలు వేదికకే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ భారీ హాలీవుడ్ చిత్రంలో బ్రై లార్సన్ టైటిల్ పాత్ర పోషించారు. ఒక లేడీ నటించిన సూపర్ గాళ్ మూవీ ఇది. అందుకే ఇలా భామలంతా ఒకే వేదికపైకి వచ్చి ప్రచారం చేయడం ఆసక్తి రేకెత్తించింది. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు.
ఆ నలుగురు భామల్లో సమంత సంథింగ్ స్పెషల్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నారు. వైట్ & బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో కాజల్ ఓ కొత్త గెటప్ లో కనిపించగా, రకుల్, తమన్నా ట్రెండీ డిజైనర్ డ్రెస్ లలో తళుకుబెళుకులు ప్రదర్శించారు. మొత్తానికి సౌత్‌లో మార్వల్ సినిమాని బ్లాక్ బస్టర్ చేయడమే ధ్యేయంగా ఆ నలుగురు భామలు ప్రచారం సాగిస్తున్నారు కాబట్టి.. ఆ మేరకు కలెక్షన్లు భారీగానే దక్కించుకుంటుందనడంలో సందేహం లేదు. ప్రఖ్యాత డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.