ఇంకా బిజీగా నే ఉందట, పెళ్లి వార్తలు పుకార్లేనట

Update: 2019-12-13 10:06 GMT
టాలీవుడ్‌ లో దశాబ్ద కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌ గా స్టార్‌ హీరోల కు జోడీ గా నటించిన ముద్దుగుమ్మ కాజల్‌ కెరీర్‌ చరమాంకం లో ఉన్నట్లు గా అనిపిస్తుంది. ఈ అమ్మడు గత రెండు మూడు సంవత్సరాలుగా ఒకటి రెండు సినిమాలు చేయడం అవి బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం రాను రాను ఈ అమ్మడికి ఆఫర్లు పూర్తిగా తగ్గడం జరిగింది. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. తమిళం లో ఒకటి చేస్తుండగా హిందీలో ఒక చిన్న సినిమా ను చేస్తుంది.

ప్రస్తుతం చాలా ఖాళీ ఖాళీగా ఉంటూ ఫొటో షూట్స్‌ చేయించుకుంటున్న ఈ అమ్మడు విజయవాడ లో ఒక షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ లో పాల్గొంది. ఈ సందర్బంగా అక్కడ కాజల్‌ మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించింది. నా పెళ్లి అంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. ఇంకా పెళ్లి గ ఉరించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంది.

ప్రస్తుతం తాను పలు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాను అంది. కమల్‌ తో మల్టీ ల్యాంగేజ్‌ సినిమా చేస్తున్నాను. హిందీలో కూడా సినిమాను చేస్తున్నాను. తెలుగులో కథలు వింటున్నాను. త్వరలోనే సినిమాను చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ అమ్మడి కెరీర్‌ గురించి ఇప్పటికే ఫుల్‌ పిక్చర్‌ అందరికి తెలిసింది. అయినా కూడా ఈమె తాను ఇంకా బిజీగానే ఉన్నాను అంటూ చెప్పుకుంటూ తిరగడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News