సినిమా హీరోయిన్ కాజల్ కు కర్నూలు జిల్లా బనగానపల్లె ఆసుపత్రిలో స్కానింగ్ చేశారు. ఆమె గర్భంతో ఉండడంతో వైద్యులు ఆమెకు స్కానింగ్ చేసి పరీక్షించారు. ఇంతకీ స్కానింగ్ చేసిన డాక్టరెవరో తెలుసా... ఇంకెవరు భల్లాల దేవుడు రానా. ఈసరికే అర్థమైపోయింది కదా.. ఇదంతా సినిమా షూటింగ్ అని.
అవును... రానా - కాజల్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' షూటింగ్ కర్నూలు జిల్లా బనగానపల్లిలోని ఆసుపత్రిలో జరుగుతోంది. గర్భం ధరించి ఉన్న కాజల్ కు ఆసుపత్రిలో డాక్టర్ అయిన రానా స్కానింగ్ చేసే దృశ్యాలను చిత్రీకరించారు. గత మూడు రోజులుగా యాగంటి పుణ్యక్షేత్రంలోనూ ఈ చిత్ర షూటింగ్ జరుపుతున్నారు.
కాగా తమ అభిమాన నటీనటులను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. కర్నూలు నుంచే కాకుండే పొరుగునే ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా సినీ అభిమానులు షూటింగ్ స్పాట్ కు తరలివస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఇక్కడ షూటింగ్ ముగిస్తారని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/