తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ నుండి కాజల్ ఎలిమినేట్ అవ్వడంతో టాప్ 5 ఎవరో క్లారిటీ వచ్చేసింది. టాప్ 5 లో కాజల్ ఉంటుందని అంతా నమ్మకం పెట్టుకున్నారు. కాని ఆమె చివరి వారంకు ముందు ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం.. అన్ని భాషల బిగ్ బాస్ సీజన్ లు ఎపిసోడ్స్ చూశాను అంటూ చెబుతూ ఉండే ఆర్ జే కాజల్ పదే పదే బిగ్ బాస్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఉంటుంది.
సాదారణ టైమ్ లో బిగ్ బాస్ తన నోటితో కాజల్ అంటూ పిలవాలనే ఉద్దేశ్యంతో మైక్ ధరించక పోవడం లేదంటే ఇంగ్లీష్ మాట్లాడటం చేసేదట. పదే పదే ప్రేక్షకులు తనను గుర్తించాలనే ఉద్దేశ్యంతో కూడా కొన్ని సార్లు ఆమె బిగ్ బాస్ రూల్స్ ను బ్రేక్ చేసేది అంటూ ఇంటి సభ్యులు స్వయంగా అన్నారు.
ఒక వీకెండ్ ఎపిసోడ్ సందర్బంగా నాగార్జున ఉన్న సమయంలోనే కాజల్ బిగ్ బాస్ రూల్స్ ను అతిక్రమించింది. కాజల్ ఇంకా మరి కొందరు ఎలిమినేషన్ లో ఉన్న సమయంలో ఒకొక్కరిని రివీల్ చేస్తే సేవ్ ఎవరు అవుతున్నారు అనే విషయాన్ని నాగార్జున ప్రకటిస్తున్నాడు. ఆ సమయంలో వారి చేతిలో ఉన్న బాక్స్ లు ఆయన చెప్తే కాని ఓపెన్ చేయాలి. కాజల్ మాత్రం ఆమె పేరు చెప్పకుండానే ఓపెన్ చేసింది. ఆసమయంలోనే నాగార్జున సీరియస్ అయ్యాడు.
ఆ తర్వాత కూడా కాజల్ చాలా సార్లు రూల్స్ ను బ్రేక్ చేసింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక కూడా బిగ్ బాస్ రూల్స్ ను ఆమె బ్రేక్ చేసింది. శనివారం నాడు ఆమె ఎలిమినేషన్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఆమె బయటకు రాకుండా ఉండాలి. కనీసం ఇంట్లో వారితో కూడా మాట్లాడకూడదు.
శనివారం ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత కాజల్ ఎలిమినేట్ అయ్యిందనే విషయం లీక్ అయ్యింది. లీక్ అయితే సమస్య లేదు కాని స్వయంగా కాజల్ తాను ఎలిమినేట్ అయ్యాను అంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ లైవ్ కు వచ్చి మరీ చెప్పింది. ఆది వారం వరకు ఆమె వేచి చూడకుండా బిగ్ బాస్ రూల్స్ ను అతిక్రమించింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో ఆమె ను బిగ్ బాస్ టీమ్ మందలించే అవకాశం లేకపోలేదు అంటున్నారు.
ఆమెకు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉన్నాయంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు. బిగ్ బాస్ కు వెళ్లే ముందే చాలా పేజీల ఒప్పందాలపై కంటెస్టెంట్స్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఆ కండీషన్స్ లో ఒక కండీషన్ ఎలిమినేట్ అయినా ఆ తర్వాత రోజు వరకు బయటకు కనిపించవద్దు. కాని కాజల్ దాన్ని బ్రేక్ చేసింది. కాజల్ కు బిబి టీమ్ విధించబోతున్న శిక్ష ఏంటీ అనేది చూడాలి.