మెగా మూవీ కోసం హైదరాబాద్ రానున్న కొత్త పెళ్లి కూతురు..!

Update: 2020-11-05 17:50 GMT
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ ఇటీవలే ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోవిడ్‌ నేపథ్యంలో అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో గౌతమ్‌ కిచ్లుతో ఏడడుగులు నడించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ప్రకటించిన చందమామ.. కేవలం రెండు వారాలు మాత్రమే బ్రేక్‌ తీసుకొని మళ్లీ సినిమా షూటింగ్‌ లో పాల్గొనడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 9 నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాజల్ కూడా 'ఆచార్య' సెట్స్ లో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉందట.

హైదరాబాద్ లో నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో 'ఆచార్య' మేజర్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో షూటింగ్ నిమిత్తం భ‌ర్త గౌత‌మ్ కిచ్లుతో క‌లిసి కాజ‌ల్ హైద‌రాబాద్ కు రానుందని తెలుస్తోంది. ఆమె సైన్ చేసిన మరో సినిమా 'ఇండియన్ 2' ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో 'ఆచార్య‌' కు బల్క్ డేట్స్ ఇచ్చిందట. ఈ షెడ్యూల్ లోనే కాజల్ కి సంబంధించిన ఎక్కువ భాగం సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాజల్ షూటింగ్ లో పాల్గొన‌డంతో పాటు ఇక్కడ టాలీవుడ్ ప్రముఖులకు పార్టీ కూడా ఇవ్వాలని ఆలోచిస్తోందట. 'ఆచార్య‌' షూటింగ్‌ కు ప్యాకప్‌ చెప్పిన తర్వాత హనీమూన్‌ కు వెళ్లేలా ప్లాన్‌ చేసుకుంటోందని తెలుస్తోంది.
Tags:    

Similar News