తెలివైన కాజ‌ల్ ఈ మార్గంలోనూ ఆర్జ‌న‌

Update: 2022-01-08 07:52 GMT
గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలోనూ ఆదాయం ఆర్జించ‌డ‌మెలానో ప‌లువురు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు చేసి చూపించారు. పూర్తి స్థాయి సినిమాల్లో న‌టంచ‌క‌పోయినా.. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించి ఆదాయాన్ని ఆర్జించారు. టైమింగ్ లీ ఫ్రెగ్నెన్సీ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చార‌క‌ర్త‌లుగా ఆదాయ మార్గాన్ని తెలివిగా ఎంచుకున్నారు చాలా మంది న‌టీమ‌ణులు.
ఇంత‌కుముందు బెబో క‌రీనా క‌పూర్.. అనుష్క శ‌ర్మ ఈ త‌ర‌హాలో ఆర్జించారు.

ఇప్పుడు అదే బాట‌లో అందాల చంద‌మామ కాజ‌ల్ కూడా వెళుతోంది. ఫ్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్ర‌ఖ్యాత బ్రాండ్ కి కాజ‌ల్ ప్ర‌చారం సాగిస్తూ ఆర్జిస్తోంది. టైమింగ్ లీ ఆదాయ ఆర్జ‌న అంటే ఇదే. నిజానికి  కాజ‌ల్ త‌న‌కు ఫ్రెగ్నెన్సీ అని క‌న్ఫామ్ అయ్యాక అప్ప‌టికే సంత‌కాలు చేసిన సినిమాల నుంచి త‌ప్పుకున్నారు. కానీ ఈ కాలాన్ని వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో మ్యానేజ్ చేసేందుకు వెన‌కాడ‌డం లేదు. కాజల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ బ్రాండ్ లను ప్రమోట్ చేస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె భర్త గౌతమ్ విదేశాల్లో ఉన్నార‌ట‌. అదే క్ర‌మంలో ఈ తీరిక స‌మ‌యంలో ఇప్పుడు గర్భధారణ ఉత్పత్తులను ప్రచారం చేయడం ప్రారంభించింది.

సోషల్ మీడియాలో ఉత్పత్తులను ప్రచారం చేయడం ద్వారా తార‌లు ల‌క్ష‌ల్లో ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే.  కాజ‌ల్ ఇన్ స్టా మాధ్య‌మంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీగా ఉంది. 2కోట్ల (20 మిలియన్ల)కు పైగా ఫాలోవర్లు కాజ‌ల్ కి ఉన్నారు. కొత్త ఉత్పత్తిని ప్రమోట్ చేస్తూ.. త‌మ ఇంటికి కిడ్ ని ఆహ్వానిస్తోంది కాజ‌ల్. ఇది చాలా ఉత్సాహంగా ఉందని కూడా చెప్పింది. నా గర్భధారణ ప్రయాణం సరైన మార్గంలో ప్రారంభమైందని నాకు నమ్మకం ఉంది. సంతోషంగా ఉన్నాను! అని తెలిపింది.  కాజ‌ల్ ఇటీవ‌ల‌ నాగార్జున సినిమా నుంచి  తప్పుకుంది. భార‌తీయుడు 2 నుంచి కూడా వైదొలిగింద‌న్న ప్ర‌చారం సాగుతోంది.
Tags:    

Similar News