బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. వందో రోజుకు దగ్గరకు వచ్చేస్తున్న వేళ.. ఈ వీకెండ్ లో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ చూశాక.. నోరెళ్లబెట్టాల్సిందే. ఒక ఆట ఆడినప్పుడు.. అందులో అంతో ఇంతో న్యాయం లాంటివి పాటించటం ఉండాలి కదా? గెలిచిందెవరు? ఓడిందెవరు? లాంటివి పట్టించుకోకుండా.. సంచాలకుడి స్థానంలో ఉన్న కాజల్ తప్పు చేశానంటూనే.. తన వర్గానికి చెందిన సన్నీని విజేతగా ఎంపిక చేసిన వైనం చూస్తే.. బిగ్ బాస్ ఆట ఎటువైపు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మంది ఉంటే చాలు.. అది కూడా ఒక ముగ్గురు తమకు తాము రింగ్ అయిపోయి.. గ్రూపుగా ఆట ఆడుతూ.. తప్పొప్పుల్ని పట్టించుకోకుండా.. తమ గ్రూపునకు మేలు జరిగేలా చూసుకోవటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరించటం ఎంతవరకు సమంజసం? ఒకవైపు కాజల్ తాను సంచాలకుడి పాత్రలో ఫెయిల్ అయినట్లుగా స్పష్టంగా చెప్పి.. సన్నీని విజేతగా నిలపటం.. దానికి సన్నీ మొదట్లో ఒప్పుకోనని చెప్పటం..ఆ తర్వాత ఓకే చేయటం చూస్తే.. ఇదంతా పక్కా గేమ్ ప్లాన్ అన్నట్లుగా అనిపించక మానదు.
హౌస్ లో సన్నీ బ్యాచ్ కాకుండా ఉన్న ముగ్గురిలో.. ఒక్క సిరి తప్పించి.. న్యాయం.. అన్యాయం లాంటివి ప్రశ్నించటమే తప్పించి.. మిగిలిన ఇద్దరు మౌనంగా ఉండటం చూస్తే నోట మాట రాని పరిస్థితి. తొండి ఆటకు ఒక లెక్క ఉంటుంది. తాజా ఎపిసోడ్ ను చూసినప్పుడు తొండి ఆట ఎలా ఉంటుందన్న దానికి నిలువెత్త నిదర్శనంగా మారిన వైనం చూశాక.. అందరూ రింగ్ అయి ఆడే ఆట ఒక ఆటనా? అన్నది ప్రశ్న.
మరోవైపు పాపం టీవీఎస్ బ్రాండింగ్ వారు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీని పరిస్థితి ఉందని చెప్పాలి. ఎందుకంటే.. తొండి ఆట ఆడి.. అందులో విజేతగా నిలిచిన వారు.. టీవీఎస్ వారి అపాచీ బైక్ మీద ఎక్కి.. ఫోజులు ఇవ్వటం.. సదరు బ్రాండ్ కు నెగిటివ్ కాదా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. విజేతకు దక్కాల్సిన దానికి భిన్నంగా.. తమ గ్రూపు వారికి విజయాన్ని కట్టబెట్టటమే లక్ష్యంగా పెట్టుకున్న వైనం కాజల్ తీరు చూస్తే.. బరాబర్ అర్థమయ్యే పరిస్థితి.
ఇలా తొండి ఆట ఆడి.. అందులో విజయం సాధించినట్లుగా నిలవటం..నెగిటివ్ గా మారటం ఖాయమని చెప్పాలి. అదే సమయంలో వినియోగించిన బ్రాండ్ మీద కూడా నెగిటివ్ ఇంప్రెషన్ పడదా? అన్న సందేహం కలుగక మానదు. ఏమైనా.. గత నాలుగు సీజన్లలో కనిపించని విచిత్రమైన తొండి ఆట.. తాజా సీజన్లో.. అందునా గడిచిన కొద్ది రోజుల్లో చోటు చేసుకుంటున్న తీరు బిగ్ బాస్ ను ఎందుకు చూస్తున్నామా? అన్న భావన కలిగేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.