ఈ ముద్దు ఇష్టం లేకుండా పెట్టినట్లు లేదే

Update: 2016-05-17 09:30 GMT
ఇదే కాజల్‌ తొలి లిప్‌ కిస్‌ అంటూ ''దో లఫ్జోం కి కహానీ'' సినిమా టీమ్ ఇప్పుడు ఒక లిప్‌ కిస్‌ పోస్టర్ ను తెగ ప్రమోట్‌ చేస్తోంది. అయితే ఈ ముద్దు వెనుక కథ మనం ఆల్రెడీ తుపాకీ లో చెప్పేసుకున్నాం. మూడ్ వచ్చేయడంతో రణదీప్‌ హుడా ముద్దెట్టేశాడని.. తరువాత కాజల్‌ అలిగిందని.. డైరక్టర్‌ ఒప్పించి ఓకె చేయించాడని.. అలా ముద్దు సీన్‌ బయటకు వచ్చిందని.. అబ్బో కథ ఇంట్రెస్టింగ్‌ గానే ఉంది.

అయితే ఒక్కసారి తథేకంగా ఈ ముద్దు పోస్టర్‌ ను చూస్తే మాత్రం.. ఇదేదో మూడ్ లో క్యారీ అయిపోయి హీరో ఒక్కడే ముద్దెట్టేశాడు అన్నట్లు మాత్రం లేదు. తనకంటే హైట్‌ ఉన్న రణదీప్‌ హుడాను.. కాజల్‌ కాస్త పైకి లేచి మరీ మెడ చుట్టూ తన చేత్తో కావలించుకుని.. చాలా రొమాంటిక్‌ గా.. ఎంతో ప్యాషనేట్‌ గా.. ముద్దు పెట్టుకున్నట్లు లేదు? ఒకవేల అమ్మడికి ముద్దు నచ్చకపోతే.. ఆ బాడీ లాంగ్వేజ్‌ అలా ఉండేది కాదేమో. మరి ఇష్టం లేకుండా మనోడు పెట్టేశాడు అంటారేటి? ఓ ఇదంతా పబ్లిసిటీ స్టంటా ఏంటి...

సినిమాలో కంటెంట్‌ ఎలా ఉన్నా కాని.. కొరియన్‌ సినిమా ''ఆల్వేస్‌'' రీమేక్‌ అని చెప్పేసి.. ఈ ముద్దు సీన్‌ తో తెగ ప్రమోట్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ కంటే టాలీవుడ్‌ లో ఈ హిందీ సినిమాకు మాంచి ఓపెనింగ్స్ వస్తాయేమో అని నిర్మాతల ఆశ అనుకుంట. జూన్ 10న తీన్‌.. క్యాబరెట్‌.. వంటి సినిమాలతో కాజల్‌ సినిమా కూడా రిలీజ్‌ కు పోటీపడుతోంది.
Tags:    

Similar News