మహేష్ హీరోగా నటించే బ్రహ్మూెత్సవం నెలాఖరున ప్రారంభం కానుంది. జూలై చివరి వారంలో ఠెంకాయ కార్యక్రమం ఉంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఈలోగానే ఈనెల 18న శ్రీమంతుడు ఆడియో రిలీజవుతుంది. ఇక్కడ ఆడియో పూర్తి చేసుకుని, అటుపై వారం గ్యాప్ తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మూెత్సం ఓపెనింగ్ పూర్తి చేసుకుంటాడట మహేష్. ఈ పనులన్నీ పూర్తయ్యాక అడ్డాల అండ్ టీమ్ విజయవాడ వెళ్తారట. అక్కడ భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంటారు.
బ్రహ్మూెత్సవం అన్న టైటిల్‌కి తగ్గట్టు కనకదుర్గమ్మ గుడిలో కూడా షూటింగ్ చేసే అవకాశం ఉంది. అమ్మవారి ఉత్సవాల్లో కీలకమైన ఘట్టాల్ని తెరకెక్కించే ఛాన్సుంది. ఎలాగూ దగ్గర పడుతోంది కాబట్టి కథానాయికల పొజిషన్లేమిటి? అన్నది కూడా రివీల్ చేసేశారు. మొన్నటివరకు అసలు ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఎవరు అనే సందేహం ఉండేది. ఇప్పుడు యునిట్ వర్గాలు ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ పిచ్చ క్లారిటీ ఇచ్చేశాయి.
ఈ చిత్రంలో సమంత ప్రధాన నాయిక. కాజల్ రెండో నాయిక. చేపకళ్ల ప్రణీత కేవలం అతిధి పాత్రధారి మాత్రమే. వీళ్లతో పాటు ఆరుగురు అత్తల కోసం ఈపాటికే వెతుకుతున్నారని అనుకున్నాం. వాళ్లు కూడా ఫైనల్ అయిపోయాక అందరితో ఉత్సవాలే ఉత్సవాలు. మహేష్ ఈ రేంజులో ముగ్గురు మరదళ్లు, ఆరుగురు అత్తలతో కలిసి నటించడం ఇదే తొలిసారి. ఆగష్టు 7న రిలీజవుతున్న శ్రీమంతుడులో మాత్రం ఒకే ఒక్క మరదలు శ్రుతిహాసన్. అదీ సంగతి.