సినిమాలో మంచి పనులు చేయడం ద్వారా హీరో, హీరోయిన్ అంటూ గొప్పగా పిలిపించుకునే వారిలో ఎక్కువ శాతం మంది నిజ జీవితంలో కనీసం ఒక్కరిద్దరికైనా సాయం చేయాలనే ఆలోచన చేయరు. లక్షల్లో సంపాదన వస్తున్నా, కోట్లు కూడబెట్టుకున్నా కూడా కొందరు సాయం చేసేందుకు మాత్రం వెనకాడుతూ ఉంటారు. కాని కొందరు మాత్రం మంచి మనసుతో తమకు తోచిన సాయం చేస్తూ ఉంటారు. అందులో ఒకరే కాజల్ అని చెప్పుకోవచ్చు. కాజల్ ఇప్పటి వరకు చాలానే ఛారిటీ కార్యక్రమాలు చేసిందట. కాని అవన్ని పబ్లిసిటీ ఇష్టం లేని కాజల్ మీడియా ముందుకు తీసుకు రాలేదు.
తాజాగా ‘కవచం’ చిత్రంలో నటించిన కాజల్ మీడియాతో మచ్చటించింది. ఈ సందర్బంగా తాను చేస్తున్న చారిటీ కార్యక్రమాల పై ఒక ప్రకటన చేసింది. తనకు అరకు అంటే అత్యంత ఇష్టమైన ప్రదేశం అని, అక్కడి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి నేను చెలించి పోయాను. అందుకే వారికి ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం గిరిజన పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఇంగ్లీష్ భోదన ఏర్పాటు చేశాను అంది. నాకు తోడుగా పలువురు మంచి మనసుతో సాయం చేసేందుకు ముందుకు వచ్చారని కాజల్ పేర్కొంది.
థింక్ పీస్ అనే స్వచ్చంద సంస్థ లో తాను భాగస్వామ్యురాలిని. ఆ స్వచ్చంద సంస్థతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను. సమాజానికి దూరంగ ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆమె కోరింది. సేవ చేయాలనుకునే వాళ్లం కొందరం థింగ్ పీస్ లో భాగస్వామ్యులం అయ్యామని, మాకు తోడు ఇంకా కూడా పలువురు సాయం చేసే మంచి మనసుతో ముందుకు వస్తున్నారని కాజల్ సంతోషం వ్యక్తం చేసింది. వీలు చిక్కినప్పుడల్లా అరకు వెళ్తానంది. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడాలి కాని, నలుగురికి తెలియాలని తాను భావించను అంది. మొత్తానికి కాజల్ గుప్త దాత అంటూ పేరు తెచ్చుకుంటుంది.