టాలీవుడ్ చందమామ అనగానే ప్రతి ఒక్కరికి ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. కళ్యాణ్ రామ్ తో లక్ష్మి కళ్యాణం అనే సినిమా లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ చందమామ మరియు మగధీర సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. దాదాపుగా దశాబ్దం కాలం పాటు టాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్ గా ఏడాదికి మూడు నాలుగు సినిమాలు అవి కూడా బడా స్టార్ హీరోలతో చేయడం జరిగింది. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. చిరంజీవి... రామ్.. అల్లు అర్జున్.. ప్రభాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మడు ఎంతో మంది టాలీవుడ్ యంగ్ అండ్ సీనియర్ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.
సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ అమ్మడు పెళ్లి పీఠలు ఎక్కింది. ప్రస్తుతం ఈ అమ్మడు తల్లి కాబోతుంది. అతి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న కాజల్ లో అందరు మహిళల్లో జరిగే శరీర మార్పుల మాదిరిగానే మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను కొందరు సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేస్తున్నారట. తాజాగా ఆ విషయమై సుదీర్ఘంగా కాజల్ స్పందించింది.
కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తన ప్రెగ్నెన్సీ అనుభవాలను మరియు తన మీద వస్తున్న ట్రోల్స్ మరియు తన బాడీ షేమింగ్ కామెంట్స్ ఇంకా తనకు వస్తున్న సలహాల గురించి సుదీర్ఘ పోస్ట్ ను షేర్ చేసింది. కాజల్ అందులో.. నా జీవితంలో అద్బుతమైన మార్పులను గమనిస్తూ వస్తున్నాను. నా శరీరం.. నా ఇల్లు.. నా వర్క్ ప్లేస్ ఇలా ప్రతి ఒక్క విషయంలో మార్పును గమనించాను. అదే కాకుండా బాడీ షేమింగ్ గురించి మీమ్స్ ను కూడా చూస్తున్నాను. ఈ సమయంలో నేను గమనిస్తున్న కొన్ని విషయాల గురించి ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
ప్రెగ్నెన్సీ సమయంలో మన శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. బరువు పెరగడంతో పాటు హార్మోన్ ల మార్పు వల్ల శరీరం మార్పు జరుగుతుంది. కడుపు లో బేబీ పెరుగుతూ ఉండటం వల్ల కడుపు పెద్దగా అవ్వడం తో పాటు బరువుగా మారుతూ ఉంటుంది. ఇదే సమయంలో మూడ్ స్వింగ్ కూడా ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తూ ఉంటాము. మనం బేబీకి జన్మను ఇచ్చిన తర్వాత కూడా కొన్ని పరిస్థితులను తట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ఈ మార్పులు అనేవి చాలా సహజ సిద్దమైన మార్పులు. కనుక ఏ ఒక్కరు కూడా వీటిని వద్దు అనుకోవడానికి లేదు. వాటిని అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. ఆ మార్పులకు మనం ఏమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుంటున్నారు అనే ఫీల్ కూడా అక్కర్లేదు. మనని మనం బాక్స్ లో పెట్టుకుని దాచుకుని బయటి ప్రపంచంకు దూరంగా ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ

సమయంలో ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి అంటూ కాజల్ ఇంకా చాలా విషయాలను ప్రెగ్నెంట్ గా ఉన్నవారికి కాబోతున్న వారికి సూచించింది. ఈసమయంలో అమ్మాయి లేదా అమ్మా వ్యవహరించిన విధానాలను కాజల్ అవగాహణ కల్పించేందుకు చేసిన ఈ పోస్ట్ కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇలా అనుభవాలను షేర్ చేసుకోవడం అనేది మంచి పరిణామం అంటూ కాజల్ పోస్ట్ లను వైరల్ చేస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ఇప్పటికే చెప్పుకొచ్చింది. మరి టాలీవుడ్ లో ఈమె రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రెగ్నెంట్ గా ఉండి బేబీ బంప్ తో ఇటీవల ఒక కమర్షియల్ యాల్ లో నటించిన కాజల్ అందరి దృష్టిని ఆకర్షించింది.