సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ను పరశురామ్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ నుండి రాబోతున్న సినిమా అవ్వడంతో సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సర్కారు వారి పాట సినిమా స్థాయిని మరింతగా పెంచేలా సంగీత దర్శకుడు థమన్ అద్బుతమైన ట్యూన్స్ ను రెడీ చేశాడు. ఇప్పటికే అందులో నుండి ఒకటి కళావతి అంటూ వదిలాడు. మహేష్ బాబు ఇమేజ్ కు మరియు ఆయన అభిమానులకు తగ్గట్లుగా కళావతి సాంగ్ ఉంది. పాటకు తగ్గట్లుగా మహేష్ బాబుకు సెట్ అయ్యే మంచి స్టెప్పులను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఓవరాల్ గా కళావతి పాట లోని సంగీతం.. సాహిత్యం మరియు కొరియోగ్రఫీ అన్ని కూడా బాగున్నాయి.
కళావతి డాన్స్ ఛాలెంజ్ ను మహేష్ కూతురు సితార ఇన్ స్టా లో షేర్ చేయడం తో అనూహ్యంగా పాట గురించి మరింత చర్చ జరిగింది. అంతే కాకుండా ఇన్ స్టా.. ఫేస్ బుక్.. యూట్యూబ్ ఇలా ప్రతి చోట కూడా షార్ట్ వీడియో ల రూపంలో కళావతి హడావుడి చేసింది.
అద్బుతమైన కళావతి పాటను అన్ని విధాలుగా ప్రేక్షకులు ఆదరించారు. యూట్యూబ్ లో ఈ పాట ఏకంగా 70 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుని అరుదైన మైలు రాయి చేరింది.
పాట విడుదల అయిన తక్కువ సమయంలోనే ఈ స్థాయి వ్యూస్ ను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. పాటకు తెలుగు ఇండస్ట్రీలో అత్యంత స్పీడ్ గా మిలియన్ లైక్స్ దక్కాయి. ఇప్పుడు 70 మిలియన్ల వ్యూస్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రికార్డు గా మహేష్ బాబు అభిమానులు చర్చించుకుంటున్నారు. కీర్తి సురేష్ మరియు మహేష్ బాబులు అందంగా కనిపించడంతో పాటు పాట తెరకెక్కించిన స్టైల్ కూడా చాలా బాగుందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
కళావతికి సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ దక్కడం వల్ల యూట్యూబ్ లో అత్యధికంగా ఆధరణ లభించింది. 70 మిలియన్ల వ్యూస్ ను తక్కువ గ్యాప్ లోనే రాబట్టడంతో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ పాట ఎలా అయితే హడావుడి చేస్తోందో రాబోయే పాటలు అంతకు మించి అన్నట్లుగా ఉండాలని థమన్ ను మహేష్ బాబు అభిమానులు కోరుతున్నారు.
ఇక థమన్ గత కొన్ని రోజులుగా రెండవ పాట గురించి అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నాడు. ఆ పాట మాస్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే విధంగా ఉంటుందని అంటున్నారు. మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గట్లుగా ఒక మంచి నీట్ మాస్ బీట్ ను దర్శకుడు పరశురామ్ ఎంపిక చేశాడు.
థమన్ ఇచ్చిన ఆ సంగీతంకు యూత్ ఆడియన్స్ ఫిదా అవ్వడం ఖాయం అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాను మే 12వ తారీకున భారీ ఎత్తున విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.