ఫోటో స్టోరీ: ప్రెగ్నెంట్ భామ సూపర్ స్మైల్

Update: 2019-12-18 10:27 GMT
హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి కల్కి కొచ్లిన్ పేరు తెలిసే ఉంటుంది. 'దేవ్ డీ'.. 'జిందగీ న మిలేగి దుబారా'.. 'ఏ జవాని హై దీవాని' లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఈమధ్య కల్కి తన ప్రెగ్నెన్సీ వార్తలతో ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.   గర్భం దాలిస్తే ఒక మామూలు వార్త అవుతుంది కానీ అంత హాట్ టాపిక్ ఎందుకు అయింది?  కారణం ఏంటంటే మ్యారేజ్ లేకుండానే తల్లి కాబోతుండడం.

కల్కి 2011 లో ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇద్దరూ విభేదాల కారణం 2015 లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కల్కికి సింగిల్ స్టేటస్ వచ్చేసింది.  అయితే గత కొంతకాలంగా గై హెర్ష్ బర్గ్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. ఇద్దరూ ఇంకా వివాహం చేసుకోలేదు కానీ కల్కి మాత్రం గర్భం దాల్చింది.  ఈ విషయంపై సోషల్ మీడియాలో "నీ భర్త ఎవరు?" అంటూ ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది.  అయితే ఇలాంటి వాటితో సంబంధం లేకుండా కల్కి తన ప్రెగ్నెన్సీ తనకు ఎమోషనల్ జర్నీ అని.. ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్తోంది.  

బాలీవుడ్ సెలబ్రిటీలకు ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ లు చెయ్యడం చాలా సాధారణం.  అదే బాటలో కల్కి కూడా ఒక ఫోటో షూట్ చేసింది.  ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  ఈ ఫోటోలో కల్కి ఎంతో సంతోషంగా నవ్వుతూ తన పొట్టపై చేతులు పెట్టుకుని అందంగా పోజిచ్చింది.  ఈ ఫోటోకు రాధిక ఆప్టే లాంటి ఎంతోమంది సెలబ్రిటీలు లైక్స్ కొట్టడం విశేషం.  ఇక సినిమాల విషయానికి వస్తే 'స్కాలర్ షిప్' అనే మూవీలో నటిస్తోంది.
 



Tags:    

Similar News