సీనియర్ హీరో రాజశేఖర్ 'పీఎస్వీ గరుడవేగ' సినిమాతో ఫాంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తనదైన స్టైల్లో నటించి మరోసారి తన సత్తా చాటాడు. యాక్షన్ సినిమాలకు తన కంటే బెస్ట్ చాయిస్ మరొకరు లేనట్టుగా 'యాంగ్రీ యంగ్ మ్యాన్' అని ప్రేక్షకులచేత పిలిపించుకున్న రాజశేఖర్ తాజాగా 'యాంగ్రీ స్టార్' అయ్యారు. రాజశేఖర్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన కొత్త సినిమా 'కల్కి' టీజర్ ను విడుదల చేశారు.
ఇది రెగ్యులర్ టీజర్ లా కాకుండా జస్ట్ బర్త్ డే ట్రీట్ లా ఉంది. 37 సెకన్ల టీజర్లో సినిమాకు సంబంధించిన కథను కానీ ఇతర డీటెయిల్స్ ఏవీ కూడా వెల్లడించకుండా ఒక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. వర్షంలో రాజశేఖర్ పై రౌడీలు దాడికి ప్రయత్నించడం.. రాజశేఖర్ వారిని ఒడుపుగా తప్పించుకోవడం.. ఇది వరస. కత్తితో పొడవబోతే పక్కకు జరిగినప్పుడు గొడుగుకు కత్తి రాసుకోవడం.. వాటి ఘర్షణకు దీపావళి క్రాకర్స్ లా మంట రావడం.. ఆ సమయంలో 'హ్యాపీ బర్త్ డే యాంగ్రీ యంగ్ మ్యాన్ డా. రాజశేఖర్' అనే క్యాప్షన్ వేసి ఆ తర్వాత 'యంగ్ మ్యాన్' పదం కాస్తా 'స్టార్' గా మారడం సూపర్ స్టైలిష్ గా ఉంది. తన ట్యాగ్ కు తగట్టే రాజశేఖర్ ఓ ఇంటెన్స్ లుక్ ఇచ్చారు.
జస్ట్ యాక్షన్ సీన్ మాత్రమే అయినప్పటికీ సినిమాటోగ్రఫీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ బాగున్నాయి. దర్శకుడు రాజశేఖర్ బలం అయిన యాంగ్రీ ఇమేజిని ప్రశాంత్ వర్మ ఫుల్ గా వాడుకున్నట్టు అనిపిస్తోంది. ఆలస్యం ఎందుకు.. అసలే యాంగ్రీ స్టార్ ఆయన.. కోప్పడతాడేమో.. త్వరగా టీజర్ చూసెయ్యండి!
Full View