పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్'లో అంత్యాక్షరి ఎపిసోడ్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఎపిసోడ్ లో ముఖ్యంగా రాజశేఖర్, జీవితలను ఇమిటేట్ చేసే సీన్ మరింత నవ్వు తెప్పించింది. ఆ సీన్ లో రాజశేఖర్ ను ఇమిటేట్ చేసిన విధంగా పవన్ కళ్యాణ్ ఏం సెప్తిరి ఏం సెప్తిరి.. ఎప్పుడు ఇలాగే సెప్తారా అంటూ డైలాగ్ చెప్పి నవ్వించిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే డైలాగ్ ను రాజశేఖర్ 'కల్కి' చిత్రంలో చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి' చిత్రం కమర్షియల్ ట్రైలర్ అంటూ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో రాజశేఖర్ లుక్ తో పాటు, సినిమా నేపథ్యం, కొన్ని యాక్షన్ షాట్స్ ను చూపించడం జరిగింది. ఇదే సమయంలో రాజశేఖర్ మొదటనే భగవద్గీత శ్లోకంకు ఏం సెప్తిరి ఏం సెప్తిరి అంటూ డైలాగ్ చెప్పి గబ్బర్ సింగ్ సినిమాలోని ఆ ఎపిసోడ్ కు కౌంటర్ అన్నట్లుగా చెప్పకనే చెప్పాడు.
ఇక కమర్షియల్ ట్రైలర్ చివరి షాట్ గా గబ్బర్ సింగ్ లో ఆంజనేయులు వేసిన స్టెప్పులను వేయించారు. ఆ స్టెప్పులు ఏంట్రా అంటూ రాజశేఖర్ తన్నడంతో ట్రైలర్ ముగిసింది. మొత్తానికి ఈ సినిమాలో గబ్బర్ సింగ్ అంత్యాక్షరి ఎపిసోడ్ కు గట్టి కౌంటర్ ఇచ్చేలా సీన్స్ ఉంటాయని అనిపిస్తుంది. 1980 నేపథ్యంలో తెరకెక్కుతున్న 'కల్కి' చిత్రంలో అదా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
Full View