మెగా ఫ్యామిలీకి క్రిస్మస్ బేబీ

Update: 2018-12-25 10:44 GMT
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రెగ్నెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం శ్రీజ సీమంతం ఫంక్షన్ ఫోటోలు కూడా మీడియాలో వచ్చాయి.  సరిగ్గా క్రిస్మస్ రోజున శ్రీజ పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారట.  

శ్రీజ భర్త కళ్యాణ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ "జీవితాంతం గుర్తుపెట్టుకోదగ్గ క్రిస్మస్.. పండంటి పాపతో దేవుడు మమ్మల్ని దీవించాడు. #శ్రీజకళ్యాణ్ బేబీ 2 వచ్చింది" అంటూ పోస్ట్ చేశాడు.  గతంలో ప్రెగ్నెన్సీ విషయం తెలుపుతూ ఇదే స్టైల్లో "#శ్రీజకళ్యాణ్ బేబీ 2 లోడింగ్" అంటూ మెసేజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  మెగా ఫ్యామిలీకి కొత్త మెంబర్ రావడంతో అందరూ సంతోషంలో మునిగిపోయారు.

శ్రీజ కు మొదటి వివాహం ద్వారా నివృతి అనే పాప ఉంది.  మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.  క్రిస్మస్ పండగరోజున ఈ శుభవార్త మెగా ఫ్యామిలీకి మాత్రమె కాకుండా ఫ్యాన్స్ అందరికీ సంతోషాన్నిస్తోంది .  
    

Tags:    

Similar News