మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ను వివాహం చేసుకున్న కళ్యాణ్ దేవ్ సినిమాలపై ఆసక్తి తో విజేత సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా తో నిరాశ పర్చాడు. ఆ తర్వాత కూడా కళ్యాణ్ దేవ్ సినిమాలతో సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు. సూపర్ మచ్చి సినిమా ఫలితం ఏంటో అందరికీ తెల్సిందే.
గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ దూరం అయ్యాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ లు దూరం అయ్యే ఆలోచనలో ఉన్నారు అనే పుకార్లు గుప్పుమన్నాయి. దాంతో కళ్యాణ్ దేవ్ సినిమాలను మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎవరు పట్టించుకోవడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ స్టఫ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు సినిమా విడుదల విషయంలో అస్సలు ఆసక్తి చూపిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రముఖ వ్యాపారవేత్త గా... పవన్ కు సన్నిహితుడిగా పేరున్న రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించిన సంగతి తెల్సిందే.
ఆయన గట్టిగా తల్చుకుంటే సినిమా విడుదల విషయం పెద్ద కష్టం ఏమీ కాదు. కాని ఆయన కొన్ని కారణాల వల్ల సినిమా ని గురించి పట్టించుకోవడం లేదు అంటూ కొందరు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కిన్నెరసాని సినిమా విడుదల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కళ్యాణ్ దేవ్ యొక్క కిన్నెరసాని ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.
కళ్యాణ్ దేవ్ హీరోగా ఇప్పటికే వచ్చిన సినిమాలు నిరాశ పర్చడంతో ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కిన్నెరసాని సినిమా విడుదల అయితే తప్ప ఆయన తదుపరి సినిమాలు లైన్ లోకి వచ్చే అవకాశం ఉంది. కాని కిన్నెరసాని ఎప్పటికి వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.