గురువుగారు.. పేరులో ఏముంది సార్‌?

Update: 2016-08-22 22:30 GMT
ఇప్పుడు అందరి కళ్ళూ మరోసారి టాలెంటెడ్ మ్యూజిక్ డైరక్టర్ కళ్యాణి మాలిక్ పైనే పడ్డాయి. నిజానికి ఈయన అసలు పేరు ఏంటనేది తెలియదు కాని.. అప్పట్లో ''అన్నమయ్య'' సినిమాకు అన్నయ్య కీరవాణి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేసినప్పుడు మాత్రం.. ఈయన ''కళ్యాణ రమణ'' అనే పేరుతోనే పాపులర్. అదే పేరును టైటిల్ కార్డుల్లో కూడా వేశారు.

అయితే ఇంటినిండా అందరి పేర్లూ.. ఎం.ఎం.కీరవాణి.. ఎస్.ఎస్.రాజమౌళి.. ఎం.ఎం.శ్రీలేఖ... ఈ టైపులో ఉంటే.. ఇక్కడ ఈయన మాత్రం కళ్యాణి మాలిక్ అనే పేరుతో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత కళ్యాణ్‌ మాలిక్ అని.. కళ్యాణ్‌ కోడూరి అని అని మార్చుకున్నారు. మొన్న వచ్చిన ''కళ్యాణ వైభోగమే'' సినిమా రిలీజప్పుడు ఇకనుండి తన పేరు కళ్యాణ రమణ అని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జ్యో అచ్చుతానంద' సినిమా కోసం ఆయన 'శ్రీ కళ్యాణ రమణ'గా మారారు. నిజానికి పాటలు హిట్టవ్వాలి.. తెలివిగా ఛాన్సులు పట్టాలి.. అంతేకాని పేరులో ఏముంటుంది సార్?

తమన్నా తన పేరు చివరన 'హెచ్' అనే అక్షరం యాడ్ చేసినా కూడా.. తమన్నాహ్‌ అని జనాలు పిలిచినా కూడా.. కేవలం 'బాహుబలి' ఒక్కటే ఆమెకు హిట్టించింది కాని.. బాలీవుడ్‌ లో అట్టర్ ఫ్లాపులు..  టాలీవుడ్లో ఫ్లాపుల వానా తగ్గలేదుగా. ఆలోచించండి!!
Tags:    

Similar News