వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన అసలు విషయాలను తాను చూపిస్తానంటూ చెబుతూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ చకచక పనులు ప్రారంభించాడు. కొన్ని నెలల క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంను ప్రకటించిన వర్మ - ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు. ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక పనిలో ఉన్న వర్మ అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు.
ఇక ఈ చిత్రంకు సంగీతంను కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ అందించబోతున్నాడు. ఈ చిత్రంలో పాటల కంటే ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా ముఖ్యమని - అందుకే ఈ చిత్రం కోసం కళ్యాణి మాలిక్ ను వర్మ తీసుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ - క్రిష్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ రెండు పార్ట్ లకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెల్సిందే. కీరవాణి సోదరుడు అయిన కళ్యాణి మాలిక్ తో వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంగీతం చేయించడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
సినిమాలోని ప్రతి పాత్ర కోసం నటీనటుల ఎంపిక విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వర్మ టెక్నీషియన్స్ విషయంలో కూడా ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని జనవరి 24న రిపబ్లిక్ డే సంద్బంగా విడుదల చేసేందుకు వర్మ సిద్దమవుతున్నాడు. అదే రోజున ‘ఎన్టీఆర్’ చిత్రం రెండవ పార్ట్ మహానాయకుడు కూడా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.