ఫైనల్‌ గా '118' రిజల్ట్‌

Update: 2019-03-18 17:39 GMT
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఈమద్య కాలంలో ఏ సినిమా చేసినా కూడా నష్టాలు తప్ప నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు దక్కిన దాఖలాలు లేవు. ఎక్కువ శాతం సినిమాలు డిస్ట్రిబ్యూటర్లతో పాటు నిర్మాతలకు నిరాశ పర్చినవే ఉన్నాయి. అయితే తాజాగా గుహన్‌ దర్శకత్వంలో రూపొందిన '118' చిత్రం మాత్రం తక్కువ బడ్జెట్‌ తో రూపొందిన కారణంగా మరియు సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో పాటు, పోటీగా మరే సినిమాలు లేని కారణంగా నిర్మాత సేఫ్‌ జోన్‌ లో పడ్డాడు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ చిత్రం వల్ల లాభం పొందారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నిర్మాత అన్ని ఏరియాల్లో కలిపి ఆరు కోట్ల రూపాయలకు గాను పంపిణీ హక్కులు అమ్మేశాడు. అయితే సినిమా ఫుల్‌ రన్‌ లో అటు ఇటుగా 10 కోట్ల వరకు వసూళ్లను తెచ్చి పెట్టిందట. దాంతో నాలుగు కోట్ల రూపాయలు అదనంగా రాబట్టినట్లయ్యింది. బయ్యర్ల షేర్‌ పోను నిర్మాతకు బాగానే వర్కౌట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఇక శాటిలైట్‌ రైట్స్‌ - డబ్బింగ్‌ రైట్స్‌ - ప్రైమ్‌ వీడియో రైట్స్‌ రూపంలో కూడా ఈ చిత్రానికి మంచి అమౌంట్స్‌ దక్కినట్లుగా చెబుతున్నారు.

మొత్తంగా నిర్మాత మహేష్‌ కోనేరుకు ఈ చిత్రం పెట్టుబడి పోను మూడు నాలుగు కోట్ల వరకు లాభాలను తెచ్చి పెట్టి ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. కళ్యాణ్‌ రామ్‌ సినిమాకు ఈమద్య కాలంలో ఇంత లాభాలు రావడం అనేది గొప్ప విషయమే. తక్కువ బడ్జెట్‌ తో కాస్త జాగ్రత్తగా కళ్యాణ్‌ రామ్‌ ఇలాంటి ప్రాజెక్ట్‌ లు చేస్తూ వెళ్తే నిర్మాతలు సేఫ్‌ ఆయన కెరీర్‌ నాలుగు కాలాల పాటు ఉంటుంది.

Tags:    

Similar News