టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఇప్పటివరకూ ఊహించని రేంజ్ లో సర్ ప్రైజ్ చేసేందుకు తారలు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మల్టీస్టారర్ ల ట్రెండ్ నడుస్తున్నా.. అనూహ్యమైన కాంబినేషన్ ఒకటి సెట్ అయిందని టాలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు. మొదటిసారిగా మెగా ఫ్యామిలీ, నందమూరి వంశం నుంచి హీరోలు కలిసి నటించేందుకు రెడీ అయిపోతున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్, సాయి ధరం తేజ్ లు ఇద్దరూ చెరో బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన సెటిల్డ్ హీరోలే. ఇప్పుడు వీరిద్దరితో కలిపి ఓ మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడు దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చౌదరి. ఇప్పటికే ఈ హీరోలిద్దరికీ స్టోరీ చెప్పేయగా.. వారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన డీటైల్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. కళ్యాణ్ రామ్-తేజుల కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అయితే మాత్రం.. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలయినట్లే అని చెప్పచ్చు.
ఈ మూవీకి కేఎస్ రామారావు నిర్మాణం వహంచనుండగా.. ఇప్పటికే రెజీనాను ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉండగా.. మరో కీలకమైన రోల్ కు అనసూయను తీసుకునే యోచనలో యూనిట్ ఉంది. మెగా, నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి చేయడమంటే.. ఇండస్ట్రీలో గ్యారంటీగా ఇదో సెన్సేషన్ అవుతుంది.