'పటాస్' సినిమా తరువాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయిన నందమూరి కళ్యాణ్ రామ్.. 'ఎంత మంచివాడవురా' తర్వాత మరో సినిమాని ప్రకటించలేదు. నేడు తన తాత నందమూరి తారకరామారావు 99వ జయంతి సందర్భంగా ఓ భారీ సినిమా అనౌన్సమెంట్ తో వచ్చాడు. ఇప్పటికే 'NKR18' ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చిన కళ్యాణ్ రామ్.. తాజాగా ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేశారు. నందమూరి హీరో కొత్త సినిమాకు ''బింబిసార'' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ''బింబిసార'' టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ 'కింగ్' గెటప్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. యుద్ధంలో తన చేతిలో చనిపోయినవారి శవాల గుట్టపై కూర్చొని వైలెంటుగా చూస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో గంభీరంగా కనిపిస్తున్నారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
చరిత్రను కోల్పోయిన పౌరాణిక భూమిలో నివసించిన ఒక అనాగరిక రాజు కథ ''బింబిసార'' సినిమా అని చిత్ర యూనిట్ ప్రకటించింది. చెడు నుండి మంచి వరకు పయనించిన టైమ్ ట్రావెల్ మూవీ అని తెలిపారు. హర్యంక వంశస్థుడు, మగధ రాజ్యాన్ని పాలించిన బింబిసారుడు కి ఈ సినిమా కథకు సంబంధం ఉందేమో తెలియాల్సి ఉంది. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడే వశిష్ఠ్. ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ ''బింబిసార'' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో క్యాథరిన్ ట్రెసా - సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు.
Full View